బంగారు టి కోసం మాతో రండి: మైనార్టీలకు పొన్నాల

We will develop minorties after come to power: Ponnala
హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. శనివారం ముస్లిం సంఘాలు, మత పెద్దలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కోసం ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాలని ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మైనార్టీలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. అల్ప సంఖ్యాక, బడుగుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పొన్నాల అన్నారు.

జైరాం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న టిఆర్ఎస్ నేతలు

కేంద్రమంత్రి జైరాం రమేష్ సమక్షంలో పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు శ్రవణ్, కట్టెల శ్రీనివాస్, కాచం సత్యనారాయణలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

రాజ్యసభ సభ్యుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే అభ్యర్థి వి హనుమంతరావు సమక్షంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంబర్‌పేటలోని ఆయన నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. దీంతో వీహెచ్ నివాసం కార్యకర్తలతో సందడిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+