మోడీతో స్నేహపూర్వకమే, టికి ఆహ్వానిస్తాం: కెటిఆర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
శాసనసభ సమావేశాల తర్వాత తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని కెటిఆర్ అన్నారు. రూ. 300 కోట్ల పెట్టుబడితో ఎల్‌జెఎల్ సిస్టమ్స్ ముందుకు వచ్చిందని తెలిపారు. త్వరలోనే సిఐఐ, ఫ్యాప్సీ ప్రతినిధులతో సమావేశమవుతామని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు.

ఇది ఇలా ఉండగా గతంలో ఏపిఎన్జీవోల సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీశైలంలపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. వారికి సచివాలయంలో పోస్టింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశించినట్లు తెలిసింది.
భిక్షగాళ్ల నిర్మూలనకు హైకోర్టులో పిటిషన్
తెలంగాణలోని భిక్షగాళ్ల నిర్మూలనకు హైకోర్టులో డివి రావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతీ ఏడాది భిక్షగాళ్ల ద్వారా రూ. 140 కోట్ల టర్నోవర్ జరుగుతోందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 11వేల మంది భిక్షగాళ్లు ఉన్నారని తెలిపారు. భిక్షగాళ్లను పునరావాస కేంద్రాల్లో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని తన పిటిషన్ లో డివి రావు కోరారు. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శులను తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.












Click it and Unblock the Notifications