మూడో రాష్ట్రంగా తెలంగాణ: బాబు, జగన్ రెచ్చగొట్టి.., రోజాకు గాలి కౌంటర్
కర్నూలు: ఏపీకి నీళ్లు రావాలంటే ఇప్పుడు మూడో రాష్ట్రమైన తెలంగాణను కూడా దాటుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. కర్నూలు జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచలో అల్ట్రా మెగా ఫుడ్ పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కర్నూలు నుంచి గుంటూరు వరకు ఆరు వరుసల రహదారి నిర్మిస్తామన్నారు.కర్నూలు జిల్లాను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. మెగా ఫుడ్ పార్కుతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా కర్నూలు జిల్లాలో తక్కువ వర్షం నమోదైందన్నారు.

గతంలో కర్నాటక, మహారాష్ట్రతో పాటు ఇప్పుడు మన పైన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చిందన్నారు. వీటిని దాటుకొని నీళ్లు మనకు రావాలన్నారు. అల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని, గతంలో కర్నాటకకు చెందిన దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పటికీ అల్మట్టి ఎత్తు పెరగకుండా అడ్డుకున్నానని చెప్పారు.
అల్మట్టి ఎత్తు పైన రాజీలేని పోరాటం చేస్తామన్నారు. గోదావరి నీటిని కృష్ణాకు తీసుకు రావాలన్నారు. అప్పుడు కృష్ణా నీటిని సీమకు వినియోగిస్తామన్నారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలో కలిపారన్నారు.
పట్టిసీమను ఐదు నెలల్లో పూర్తి చేశామన్నారు. ఈ మెగా ఫుడ్ పార్కుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుల పైన కొందరు రాజకీయం చేశారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.
సీమవాసులకు నీరు వస్తే వారిని పట్టించుకోరనే వ్యతిరేకించారని వైసిపిని ఉద్దేశించి అన్నారు. ఎన్ని వందల కోట్లు ఖర్చైనా కర్నూలులో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు.
జగన్ సీమ ద్రోహిగా మిగిలిపోతారు: దేవినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. గొల్లపల్లి, హంద్రీనీవా పనులను మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి దేవినేని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. సీమ రైతుల కన్నీళ్లు తుడవాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు తెస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారన్నారు. ఎప్పటికైనా జగన్ సీమ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పనుల్లో జాప్యంపై అధికారులపై మండిపడ్డారు.
తెలుగు గంగకు ఏడాది లోపు పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామన్నారు. రాయలసీమ కరువురహిత ప్రాంతంగా మారడం జగన్‌కు సహించడం లేదన్నారు. మహారాష్ట్ర, కర్నాటకలను రెచ్చగొట్టి పట్టీసీమను ఆపే ప్రయత్నం జగన్ చేశారని ఆరోపించారు. పట్టిసీమను అడ్డుకునేందుకు జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
రోజాకు గాలి కౌంటర్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ భర్త.. కమిషనర్‌ను దూషించారని, పోలీసులను, వైసీపీ కార్యకర్తలు దూషించారని మండిపడ్డారు.

ఆదివారం నాడు రోజా... గాలి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలో పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు చెందిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.
ఆయనకు సలాం కొడుతున్న పోలీసులు వైసీపి నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నగరి మున్సిపల్ ఛైర్మన్ శాంతకుమారి భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో రోజా మండిపడ్డారు. టీడీపీ నేతల కుట్రలను తాము ఎదుర్కొంటామన్నారు. రోజాకు గాలి కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications