అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ, వాగ్దానాలు అమలు చేయకపోతే నిలదీయండి: జగన్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం:పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుందని అన్నారు ఈ ప్రాజెక్టులో టిడిపి నేతలు దోచుకొంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.

'పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమదే, వైఎస్ చెప్పినట్టు వింటే మరోలా ఉండేది''పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమదే, వైఎస్ చెప్పినట్టు వింటే మరోలా ఉండేది'

వైఎజ్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో బుదవారం నాటితో ముగియనుంది.ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో మీడియా ప్రతినిధులతో జగన్ చిట్ చాట్ చేశారు.

వైఎస్ కుటుంబంతో విబేధాలు, చెన్నారెడ్డి ఒప్పుకోలేదు: కందుల రాజమోహన్ రెడ్డివైఎస్ కుటుంబంతో విబేధాలు, చెన్నారెడ్డి ఒప్పుకోలేదు: కందుల రాజమోహన్ రెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు. అధికారంలోకి వస్తే వైసీపీ ఏ కార్యక్రమాలను చేపట్టనుందనే విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను వంద శాతం నెరవేర్చనున్నట్టు వైఎస్ జగన్ చెప్పారు.

 పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ

పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ

పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. టిడిపి నేతలు కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టుల అవతారాలెత్తి దోచుకొంటున్నారని జగన్ విమర్శించారు.ప్రాజెక్టులకు సంబంధించి ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచారని జగన్ విమర్శించారు.. అవినీతిపరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలిచారని జగన్ అన్నారు.కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం అందుకే నిర్వహిస్తోందని జగన్ అనుమానాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

Polavaram Project Politics In Ap | Oneindia Telugu
 ఎన్నికల మేనిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెడతాం

ఎన్నికల మేనిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెడతాం

అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామనే విషయాలను ముందుగానే ప్రకటించనున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. మా మేనిఫెస్టోను ఇంటర్నెట్‌లో పెట్టనున్నట్టు జగన్ చెప్పారు.తాము ప్రజలకు ఇచ్చిన హమీలకు కట్టుబడకపోతే ప్రశ్నించవచ్చని జగన్ చెప్పారు.చంద్రబాబు మాదిరిగా వ్యవహరించబోనని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చనున్నట్టు చెప్పారు.

 విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం

విలువలతో కూడిన రాజకీయాలను చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. తమ పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డికి సూచించానని ఆయన చెప్పారు.తన సూచన మేరకు శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని ఆయన గుర్తుచేశారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు జగన్ చెప్పారు.చంద్రబాబునాయుడు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

 సంక్షేమ పథకాలు అందరికీ

సంక్షేమ పథకాలు అందరికీ

సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేస్తామని జగన్ చెప్పారు. కులాలు, మతాలు, ప్రాంతాలనే తేడా లేకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ వర్తింపజేస్తామని జగన్ చెప్పారు.దశలవారీగా మద్యపానాని నిషేధిస్తామని చెప్పారు. రైతులకు ఏటా రూ. 12,500 మే నెలలోనే చెల్లిస్తామని అన్నారు. పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోలు చేస్తామని తెలిపారు.

 45 ఏళ్ళకే పెన్షన్ పథకానికి కారణమిదే

45 ఏళ్ళకే పెన్షన్ పథకానికి కారణమిదే

ధర్మవరంలో చేనేత మహిళల కష్టాలు చూశాకే.. 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే 'వైఎస్‌ఆర్‌ చేయుత' పథకం కింద నెలకు రూ. 2వేల పెన్షన్‌ ఇస్తానని తెలిపారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు. రూ. వెయ్యి కంటే ఎక్కువగా వచ్చే వైద్య బిల్లులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పారు.

English summary
ysrcp president Ys Jagan made allegations on Ap chief minister Chandrababunaidu. we will implement every promise in the manifesto he said.Ys Jagan chit chat with media on wednesday in Anantapuram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X