విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషామీరా కేసు: 'నిందితులు తప్పించుకోలేరు', 'స్థానికేతరులతో విచారణ'

బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా కేసులో తప్పుచేసిన వారెవ్వరూ కూడ తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా కేసులో తప్పుచేసిన వారెవ్వరూ కూడ తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. ఈ కేసును పునర్విచారణ చేసేందుకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

విజయవాడ క్లబ్ ఆద్వర్యంలో 25 మంది అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహయం అందించే కార్యక్రమంలో ఏపీ డీజీపీ సాంబశివరావు ఆదివారం నాడు పాల్గొన్నారు.

'ఆయేషామీరా హత్యపై పునర్విచారణ', 'ఆ నివేదిక ఇవ్వండి' 'ఆయేషామీరా హత్యపై పునర్విచారణ', 'ఆ నివేదిక ఇవ్వండి'

విజయవాడకు సమీపంలో ఉన్న హస్టల్‌లోని బాత్రూమ్ వద్ద బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అనుమానాస్పదస్థితిలో మరణించింది. 2007 డిసెంబర్ 27వ, తేదిన ఆయేషా మీరా హత్యకు గురైంది.

ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.ఈ హత్యకు
కొందరు రాజకీయనేతలకు ప్రమేయం ఉందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఇప్పటికీ కూడ ఆ కుటుంబం ఇదే రకమైన అభిప్రాయంతో ఉంది.

నిందితులు ఎంతటివారైనా వదలబోం

నిందితులు ఎంతటివారైనా వదలబోం

ఆయేషా మీరా హత్యకేసులో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చోటుచేసుకొన్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించింది. ఆనాడు టిడిపి ఆయేషామీరా కుటుంబానికి అండగా నిలిచింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని కూడ టిడిపి డిమాండ్ చేసింది.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో నిందితుడిగా ఉన్న సత్యంబాబు నిర్ధోషిగా ఇటీవల హైకోర్టు విడుదల చేసింది. దీంతో ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

దోషులను పట్టుకొనేందుకు అవకాశం

దోషులను పట్టుకొనేందుకు అవకాశం

ఆయేషామీరాను హత్య చేసిందెవరో తెలుసుకొనేందుకు పునర్విచారణ కీలకంగా మారే అవకాశం ఉందనీ ఏపీ మహిళా కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. ఆయేషామీరా కుటుంబానికి ఏపీ మహిళా కమిషన్ అండగా నిలుస్తోందని ఆమె చెప్పారు. ఆయేషా మీరా హత్యకేసులో నిజమైన దోషులకు శిక్షపడేవరకు పోరాటం చేస్తామని నన్నపనేని రాజకుమారి ప్రకటించారు.

స్థానికేతర పోలీసులతోనే విచారణ జరపాలి

స్థానికేతర పోలీసులతోనే విచారణ జరపాలి

ఆయేషామీరా హత్య కేసును పునర్విచారణ చేసేందుకుగాను ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడాన్ని కుటుంబసభ్యులు స్వాగతించారు. అయితే స్థానికేతర పోలీసులే సిట్ ఉంటే ప్రయోజనంగా ఉంటుందని ఆయేషామీరా తల్లి షంషాద్‌బేగం, తండ్రి ఇక్బాల్‌భాషా అభిప్రాయపడ్డారు. సత్యంబాబు నిర్దోషి అని కోర్టు తీర్పు వెల్లడించడంతోనే స్థానిక పోలీసుల డొల్లతనం బయటపడిందన్నారు. ఈ కేసులో విచారణే సాగలేదన్నారు. నిందితులను తప్పించేందుకే పోలీసులు ప్రయత్నించారని వారు ఆరోపించారు. స్థానికేతర పోలీసులతోనే ఈ కేసును విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

సుప్రీం కోర్టు మార్గదర్శకంలోనే విచారణ

సుప్రీం కోర్టు మార్గదర్శకంలోనే విచారణ

హైకోర్టు పర్యవేక్షణలోనే ఈ కేసు విచారణ సాగాలని ఆయేషామీరా కుటుంబసభ్యులు కోరారు. అయితే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఈ కేసు విచారణ మంగళవారంనాడు రానుంది. ఇదిలా ఉంటే ఆయేషామీరా హత్యకేసును పునర్విచారణ చేయనున్నట్టు విజయవాడ సీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఆయేషా మీరా హత్యకేసు అత్యంత సంక్లిష్టమైందన్నారు. ఈ తరహ కేసుల విచారణపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని మార్గదర్శకాలను జారీచేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ తరహలోనే విచారణ చేస్తామన్నారు.

English summary
we will punish who involved in Ayesha Meera murder case Said Ap Dgp Sambhasivarao on Sunday at Vijayawada.Vijayawada city commissioner will interrogate this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X