కుట్ర బయటపెడ్తాం: గౌడ్, లెక్క తేల్చింది కిరణే: విఠల్

సీమాంధ్రలో సామాన్యులను రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తున్న వారి కుట్రలను తాము బయటపెడతామన్నారు. సీమాంధ్రుల సమస్యలను తీర్చేందుకు ఐక్యకార్యాచరణ సమితిలు ఉన్నాయని, తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే తామేం చేయాలో చెప్పాలన్నారు. రెండు నెలలైనా తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు కదల్లేదన్నారు.
ఉద్యోగుల లెక్క తేల్చింది కిరణ్, అశోక్‌లే: విఠల్
తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగుల లెక్క ఎవరు తేల్చలేకపోయారని ఆ లెక్కను తేల్చింది ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలేనని టిఎన్జీవో నేత విఠల్ అన్నారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు నలభై వేల మంది అని అశోక్ బాబు చెబితే, కిరణ్ లక్షకు పైగా లెక్క తేల్చాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఎవరి రాష్ట్రంలో వారు ఉద్యోగాలు చేసుకోవాలన్నారు. జన భేరీ సభకు అనుమతి రావడమే తెలంగాణ వచ్చిందనేందుకు మంచి నిదర్శనం అన్నారు.
హుస్సేన్ సాగర్ కూల్చి..: రఘు
హుస్సేన్ సాగర్‌ను కూల్చి ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్ నిర్మించారని విద్యుత్ ఉద్యోగ సంఘం నేత రఘు అన్నారు. హైదరాబాదులో ఎప్పటి నుండో విద్యుత్ ఉందన్నారు. మనకు ఆంధ్రా వాళ్లు వచ్చి నేర్పిందేమీ లేదన్నారు. అన్నిచోట్ల జరిగినట్లు ఇక్కడా విభజన జరుగుతుందన్నారు. సమ్మె ఎందుకు చేస్తున్నారో ఎపిఎన్జీవోలు చెప్పలేకపోతున్నారన్నారు. చూస్తుంటే పదేళ్లు కాదు కదా పది నిమిషాలు కూడా హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఒప్పుకునేది లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. తెలంగాణకు పాత బస్సులు, సీమాంధ్రకు రంగురంగుల బస్సులను తెలంగాణ ఆర్టీసి జెఏసి నాయకుడు చెప్పారు.












Click it and Unblock the Notifications