AP Weather:మరో మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు
అమరావతి: ఇప్పటికే గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరో మూడు రోజులపాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.
ఆది, సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కుిరసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Recommended Video
కాగా, శనివారం రోజున కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసింది. దీంతో రహదారులు జలమయమ్యాయి. లోతట్లు ప్రాంతాలు వరద నీటితో ముగినిపోయాయి. విజయవాడలో భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బందరు రోడ్డ్లు చెరువులను తలపించాయి. బెంజి సర్కిల్‌లో వర్షపునీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం కలిగింది. గుంటూరు నగరంలోనూ భారీ వర్షంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఇప్పుడు మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమమత్తయ్యారు. అంటు వ్యాధులు వచ్చే అవకాశాలుండటంతో నివారణ చర్యలు చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications