15రోజుల చొప్పున, ఇక రేవంత్ కోసం నిలబడండి: లోకేష్ ట్వీట్ వెల్‌కం
హైదరాబాద్: తాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చెప్పారు. ఇక నుంచి ఏపీలో 15 రోజులు, తెలంగాణలో 15 రోజులు ఉంటానని చెప్పారు. గుంటూరు కేంద్రంగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇక్కడ కార్యకర్తల ఇబ్బందులను ఇక్కడి నుండి పరిష్కరిస్తానని చెప్పారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదుకు రావాలంటే కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే తాను ఏపీలోని సమస్యలు గుంటూరు కేంద్రంగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

రేవంత్ రెడ్డి రాకపై లోకేష్ ట్వీట్
Revanth has always stood for people of Telangana & TDP. People of Telangana & TDP have stood up for him now. Welcome back Revanth!
— Lokesh Nara (@naralokesh) July 1, 2015 ఓటుకు నోటు కేసులో అరెస్టై, చర్లపల్లి జైలు నుండి బుధవారం నాడు విడుదలైన రేవంత్ రెడ్డికి నారా లోకేష్ ట్విట్టర్‌లో స్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన నిలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, టీడీపీ ఆయనకు అండగా నిలబడాలని కోరారు. వెల్ కమ్ బ్యాక్ రేవంత్ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications