సీఎం జగన్ ప్రజాదరణ ఏ స్థాయిలో ఉంది : విపక్ష పార్టీల ఓట్ షేర్ ఏంత : పబ్లిక్ పల్స్ లెక్కలు-వాస్తవాలు..!!
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాదరణ పెరిగిందా - తగ్గిందా. రెండున్నారేళ్ల కాలం పాలన పూర్తి చేసుకుంటున్న జగన్ పాలన పైన ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు. విపక్షాల పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు వీటన్నింటికీ తాజాగా వరుసగా జరిగిన ఎన్నికలే సమాధానం చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా అధికారం దక్కించుకున్న జగన్ ఏకంగా 151 అసెంబ్లీ..22 లోక్ సభ సీట్లు సాధించారు. ఆ తరువాత రెండేళ్ల పాలన వేళ రాష్ట్రంలో స్థానిక సంస్థలు..పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఇవి ఒక రకంగా రెండేళ్ల పాలన మీద ప్రజాభిప్రాయంగా వైసీపీ పరిగణిస్తోంది.

తమకు పాటిటివ్ ఓటింట్ అంటున్న వైసీపీ
సంక్షేమ పధకాలే తమకు ఇంత పెద్ద మొత్తంలో విజయం అందించాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే తాజాగా జరిగి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి అధికంగా 17.66 శాతం ఓట్లు దక్కాయి. మొత్తం పోలైన ఓట్లలో 67.61 శాతం ఓట్లు అధికార పార్టీకే వచ్చాయి. అయితే, టీడీపీకి భారీగా ఓటింగ్ షేర్ తగ్గిపోయింది. టీడీపీకి 22.79 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, విపక్షం ఓట్లతో 16.38 శాతం మేర తగ్గుదల కనిపించింది. తాజాగా జరిగిన జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 1.30 కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.

జగన్ కు 2019 కంటే పెరిగిన ప్రజాదరణ
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లతో కలిపి గ్రామీణ ప్రాంతానికి చెందిన 1,30,53,282 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో 67.61 శాతం ఓట్లను అధికార వైఎస్సార్‌సీపీ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్ధులు దక్కించుకున్నారు. టీడీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 22.79 శాతం ఓట్లు దక్కాయి. ఓటర్లలో ఎస్సార్‌సీపీ గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్ధులకు 88,25,343 మంది ఓట్లు వేశారు.

టీడీపీకి ఓటింగ్ శాతం తగ్గటం వెనుక
టీడీపీ అభ్యర్ధులకు 29,75,238 మంది ఓటు వేశారు. ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలకు మిగిలిన ఓట్లు దక్కాయి. రెండేళ్ల పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల తేడా 45 శాతం ఉండటం రాజకీయాల్లో అత్యంత అరుదైన అంశంగా పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో దాదాపు సగం మంది ప్రజలు జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇదంతా గ్రామీణ ఓటర్ల తీర్పుగా వాదన వినిపిస్తోంది.

ఇదే 2024 ఎన్నికల వరకు నిలుస్తుందా
అయితే, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా తీర్పు వచ్చింది. తాడిపత్రి మినహా అన్ని మున్సిపాల్టీలను వైసీపీ గెలుచుకుంది. కార్పోరేషన్లలో 14 కు 14 వైసీపీ గెలిచింది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వైసీపీ నేతలు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. అధికార పార్టీకి కొంత మొగ్గు ఉండటం సాధారణమే అంటూనే..వరుసగా అన్ని ఎన్నికల్లోనూ అదే ఓటింగ్ శాతం ఏక మొత్తంటా ఒకే పార్టీకి రావటమనేది ఏపీలో వైసీపీకే దక్కిందని చెబుతున్నారు.

వైసీపీ ధీమా..పొలిటికల్ చర్చ
అయితే, స్థానిక ఎన్నికల్లో వచ్చిన తీర్పు తమకు ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని వైసీపీ బలంగా నమ్ముతోంది. టీడీపీ మాత్రం ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందని వాదిస్తోంది. దీంతో.. ఇదే ఆదరణ వైసీపీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉంటుందా-తగ్గుతుందా అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications