మీరు ఏ బిడ్డను వదులుకుంటారు?: ఆ ముగ్గురికి బాబు

రాష్ట్ర విభజన సమస్యకు సంబంధించి సామరస్య పరిష్కారాన్ని చూపించాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానికి బాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
"ప్రధానికి నేను రాసిన లేఖను ఎద్దేవా చేసే ముందు.. తమ బిడ్డల్లో ఏ బిడ్డను వదులుకుంటారో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస నేతలు ప్రకటించగలరా!?'' అని నిలదీశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన సామరస్య పరిష్కారాన్ని కనుక్కోవాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రధానిని తాను డిమాండ్ చేశానని చెప్పారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, దేశం మొత్తంమీద నేరాల్లో 11 శాతం రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, నేరాల విషయంలో దేశంలో మన రాష్ట్రానిది రెండో స్థానమని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందోనని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications