Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాసిరెడ్డి పద్మ దారెటు - ఆ పార్టీల్లోకి నో ఎంట్రీ..!?

వాసిరెడ్డి పద్మ. మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా పని చేసారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసారు. టీడీపీలో చేరుతారని ప్రకటన చేసారు. దాదాపు ఏడాది కాలం అయినా ఇంకా ఆ పార్టీలో చేరలేదు. జనసేనలోనూ చేరుతారనే చర్చ జరిగింది. అయినా, వైసీపీని వీడిన తరువాత వాసిరెడ్డి పద్మ ఇంకా ఏ పార్టీలో చేరకపోవటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. మరి.. వాసిరెడ్డి పద్మ రాజకీయంగా ఏం చేయబోతున్నారు.. ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

వాసిరెడ్డి పద్మ తొలుత ప్రజారాజ్యంలో పని చేసారు. ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా వ్యవహరిం రు. ఆ తరువాత వైసీపీలో చేరారు. జగన్ హయాంలో కీలకమైన మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. జగన్ పార్టీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి కూటమి పార్టీల్లో చేరుతారని ప్రచారం సాగింది. జగన్ హయాంలో కీలక పదవి దక్కినా ఆ పార్టీ పైన పద్మ కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు జగన్ అన్యాయం చేశారని విమర్శలు చేసారు. కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదని వాసిరెడ్డి పద్మ మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, వాసిరెడ్డి పద్మకు మాజీ సీఎం జగన్ కేబినెట్ హోదా గౌరవించారని చెప్పుకొచ్చారు. ఇక.. వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరే అవకాశం ఉందని భావించారు. కాగా, పద్మ చేరికకు టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారని తెలిసింది.

Which Party Will Vasireddy Padma Choose Next speculations Abuzz in political circles

ఆ తరువాత జనసేనలో చేరేందుకు పద్మ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే,అప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరతారన్న ప్రచారంతో వాసిరెడ్డి పద్మ ఆ ఆలోచనను మానుకున్నారు. సామినేని జనసేనలో చేరడమే కాదు కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దీంతో.. జనసేన లో చేరాలనే ఆలోచన విరమించుకున్నారు. దీంతో.. టీడీపీ వైపు చూసారు. ఎంపీ కేశినేని చిన్ని ద్వారా రాయబారం నడిపినట్లు ప్రచారం జరిగింది. పలు మార్లు చిన్నితో సమావేశం కావటం.. ఆయన టీడీపీ ముఖ్య నాయకత్వం వద్ద ప్రస్తావన చేసినట్లుగా పార్టీ నేతల సమాచారం. అయినా.. టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇక.. బీజేపీ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోంది. అయినా.. వాసిరెడ్డి పద్మకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో.. ఇప్పుడు పద్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+