• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నూతన డీజీపీ నియామకంపై కసరత్తు:వీళ్లిద్దరిలో ఒకరేనా?...24 గంటల్లో స్పష్టత

By Suvarnaraju
|

అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు జరుపుతోంది. ప్రస్తుత డీజీపీ ఎం.మాలకొండయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎంపిక కోసం ప్రక్రియ సాగుతోంది.

మాలకొండయ్య అనంతరం సీనియార్ పోలీస్ అధికారుల జాబితా పరిశీలిస్తే ఏపీ క్యాడర్‌లో డీజీపీ హోదా కలిగిన అధికారులు ఏడుగురు ఉన్నారు. వీళ్లందరిలోనూ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే 1982 బ్యాచ్‌కు చెందిన ఎస్‌.వి.రమణమూర్తి అందరికంటే ముందున్నారు. ఆ తర్వాత 1986 బ్యాచ్‌కు చెందిన వీఎస్‌కే కౌముది, ఆర్‌.పి.ఠాకూర్‌, వినయ్‌ రంజన్‌ రే, డి.గౌతమ్‌ సవాంగ్‌ వరుసగా సీనియారిటీ జాబితాలో ఉన్నారు.

Who is the new AP DGP?...The possibility of clarity in 24 hours

ఆ తర్వాత 1986 బ్యాచ్‌కు చెందిన వీఎస్‌కే కౌముది, ఆర్‌.పి.ఠాకూర్‌, వినయ్‌ రంజన్‌ రే, డి.గౌతమ్‌ సవాంగ్‌ వరుసగా సీనియారిటీ జాబితాలో ఉన్నారు. వీరిలో వీఎస్‌కే కౌముది ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సీనియారిటీ ప్రాతిపదికన ఆధారంగా నలుగురు అధికారుల పేర్లను ఎపి డీజీపీ ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తుందని సమాచారం. ఆ జాబితాలో ప్రస్తుత రోడ్డు భద్రతా సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.వి.రమణమూర్తి, ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌, జైళ్ల శాఖ డీజీపీ వినయ్‌ రంజన్‌ రే, విజయవాడ నగర పోలీసు కమిషనరు గౌతం సవాంగ్‌ల పేర్లు ఉండొచ్చని పోలీస్ వర్గాల అంచనా.

అయితే వీరిలోను గౌతం సవాంగ్‌, ఆర్‌.పి.ఠాకూర్‌ నూతన డిజిపి రేసులో ముందున్నట్లుగా తెలుస్తోంది. వీళ్లిద్దరిలోనే ఒకరు కొత్త పోలీస్ బాస్ గా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా పోలీస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నూతన డిజిపి నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబుదే తుది నిర్ణయం అయినందున... వీరిద్దరిలోనే ముఖ్యమంత్రి ఒకరిని పోలీస్ బాస్ గా ఎంపిక చేయదలుచుకుంటే గౌతం సవాంగ్‌కు ఆ ఛాన్స్ దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని పోలీస్ వర్గాలు అభిప్రాయం. అయితే మరో 24 గంటల్లోనే ఈ విషయమై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

మరో ఏడాదిలోగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈసారి డిజిపిగా ఎంపికయ్యే పోలీస్ బాస్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత కీలకమైన ఈ సమయంలో డిజిపి సహాయసహకారాలు ప్రభుత్వానికి చాలా అవసరం అయినందున సహజంగా ఏ ప్రభుత్వం అయినా తమకు అనుకూలంగా వ్యవహరిస్తారనే నమ్మకం ఉన్న వ్యక్తినే ఈ పోస్టులో కూర్చోబెడుతుంది. అందువల్లే కాబోయే పోలీస్ బాస్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravati: The state government is working on the new DGP selection process. The new DGP selection process is ongoing in the wake of the current DGP M.Malakondaya retirement on 30th of this month. Police sources estimate that Gautam Sawang or RP Thakur is likely to be appointed as AP New DGP among the senior officers list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more