నంద్యాల బైపోల్: పవన్ మద్దతు ఎవరికీ, నేడు కీలక నిర్ణయం
నంద్యాల:నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ బుదవారం నాడు నిర్ణయం తీసుకోనున్నారు. జనసేనాని నిర్ణయం నంద్యాల ఉపఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మనందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి బిజెపి మద్దతును ప్రకటించింది. అయితే బిజెపి కండువాలు, బ్యాడ్జీలు, జెండాలతో వచ్చి ప్రచారం నిర్వహిస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి తరపున సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ నెల 16న, ప్రచారం నిర్వహించారు.

నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న పవన్‌కళ్యాణ్
నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఈ నెల 16వ, తేదిన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. నంద్యాల ఉపఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వనున్నారో జనసేన ప్రకటించే అవకాశాలున్నాయి. జనసేనానీ ప్రకటన కోసం రాజకీయపార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నాయి. దీంతో పవన్‌కళ్యాణ్ ప్రకటన కీలకం కానుంది.
Recommended Video


2009లో నంద్యాలలో పిఆర్‌పి కీలకం
2009 ఎన్నికల్లో నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో పిఆర్‌పి అభ్యర్థి గణనీయంగా ఓట్లను సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు పిఆర్‌పి అభ్యర్థి చీల్చిన ఓట్లు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల సమయంలో పిఆర్‌పి అభ్యర్థికి 35వేల ఓట్లు దక్కాయి. పోలైన ఓట్లలో సుమారు 25 శాతం ఓట్లు పిఆర్‌పి అభ్యర్థికి వచ్చాయి. అయితే ఆనాటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడా లేకపోలేదు. కానీ, ఈ ఎన్నికల్లో పవన్ మద్దతు పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

టిడిపి విధానాలపై విమర్శలు
మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన చీఫ్ బహిరంగంగానే విమర్శలను ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదాతో పాటు భూసేకరణ లాంటి కీలకమైన విషయాలపై పవన్ టిడిపి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పదిహేను రోజుల క్రితం పవన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిశారు.ఆ సమయంలో బాబుతో పవన్‌కళ్యాణ్ ఏకాంతంగా చర్చించారని సమాచారం. అయితే ఆ సమయంలో రాజకీయాలపై చర్చలు కూడ సాగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

తటస్థ వైఖరి తీసుకొంటారా, టిడిపికి మద్దతిస్తారా?
మూడేళ్ళుగా టిడిపి విధానాలతో విబేధించిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతిస్తే రాజకీయంగా పవన్ విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలను పార్టీలోని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల సమయంలో తటస్ఠవైఖరిని తీసుకొంటేనే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడేవారు కూడ లేకపోలేదు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో పవన్ తన నిర్ణయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాల నుండి సమాచారం.

భూమా కుటుంబం కోసం మద్దతిస్తారా?
భూమా కుటుంబంతో పవన్‌కళ్యాణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. భూమా కుటుంబం 2009లో పిఆర్‌పిలో ఉన్నారు. ఆ సమయంలో పిఆర్‌పి తరపున పోటీచేసిన భూమా కుటుంబసభ్యుల తరపున పవన్‌కళ్యాణ్ ప్రచారం చేశారు. అంతేకాదు భూమా కుటుంబసభ్యులతో పవన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని భూమా కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో పవన్ తమకే మద్దతిస్తారని కూడ భూమా కుటుంబసభ్యులు దీమాగా ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications