Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లా ఎవరి వైపు..!
ఏపీలో ఎండ వేడితో పాటు రాజకీయ వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు, పాణ్యం, నంద్యాల, శ్రీశైలం, నందికట్కూరు, కొడుమూరు, యమ్మిగనూరు, ఆలురు, మంత్రాలయం, ఆదోణి, డోన్, పత్తికొండ, బనగానపల్లి, ఆళ్లగడ్డ ఉన్నాయి.
2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం అక్కడ వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాలలో నియోజకవర్గాల్లో తాగు నీటి సమస్య కనిపించింది. అక్కడ ప్రజలు తమకు ఏ ప్రభుత్వం వచ్చినా.. నీటి సమస్య తీరడం లేదని చెబుతున్నారు. కర్నూలు సిటీ విషయానికొస్తే ఇక్కడ వైసీపీ.. అభ్యర్థిని మార్చింది. ఇక్కడ మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ ను బరిలో నిలిపింది.

ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన్ను బరిలో నిలిపారు. ఇక టీడీపీ నుంచి టీజీ భరత్ పోటీ చేస్తున్నారు. అయితే టీజీ భారత్ ప్రజల్లోకి చోచ్చుకెళ్లడం లేదని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. ఆయన వద్ద వెళ్లాలంటే కష్టమని చెబుతున్నారు. టీజీ వెంకటేశ్ కు ఉన్న మంచి పేరు టీజీ భరత్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇటు ఇంతియాజ్ మాత్రం సామాన్య ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి హెడ్చ్ ఉన్నా.. టీజీ భరత్ తీరుతో నష్టం వాటిల్లే ప్రమాదముందని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు.
పాణ్యం, ఎమ్మిగనూరు, ఆదోణిలో ప్రతిపక్ష అభ్యర్థులు కాస్త దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. పాణ్యం నుంచి గౌరు చరిత రెడ్డి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ సారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి గతం కంటే సీట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో టీడీపీ కాస్త పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ వైసీపీ ఆధిపత్యం కొనసాగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications