అధికారంలో ఉంది: టిడిపిలో చేరడంపై ఆనం వ్యాఖ్య, బాబు గ్రీన్ సిగ్నల్
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అందుకే తాము ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం చెప్పారు.
ఆనం సోదరులు (ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి) సైకిల్ ఎక్కేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన శుక్రవారం స్పందించారు. అభివృద్ధి అధికారంలో ఉన్న టిడిపితోనే సాధ్యమన్నారు. అందుకే వెళ్తున్నామని చెప్పారు.

తాము పదవుల కోసం వెంపర్లాడటం లేదని స్పష్టం చేశారు. రేపటి భవిష్యత్తు కోసం టిడిపిలో చేరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు పోరాటంతో రాజకీయాలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2.8 శాతానికి పడిపోయిందన్నారు.
నిన్న కూడా ఆయన మాట్లాడారు. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం లేదని, టిడిపిలో ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తామని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. టిడిపి అధ్యక్షులు మాతో సంప్రదింపులు జరిపారన్నారు. మంత్రి నారాయణతో విభేదాల్లేవని చెప్పారు. కాగా, ఆనం సోదరుల చేరికకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications