వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవీపీ వైసీపీలోకి ఎందుకు వెళ్లట్లేదు? జగన్-షర్మిల మధ్య విభేదాలపై వైవీ ఇలా..

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర రావులు కలవకుండా తాను అడ్డుపడ్డానని జరుగుతున్న ప్రచారాన్ని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ కేవీపీ, జగన్‌కు అండగా నిలువకుండా కాంగ్రెస్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డికి, కేవీపీకి మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఆయన వైసీపీలోకి రాలేదా అన్న ప్రశ్న ఎదురైంది.

నాకు తెలియదు ఆయననే అడగండి

నాకు తెలియదు ఆయననే అడగండి

దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అది సరికాదని, అలాంటిది అంటూ ఏమీ లేదని చెప్పారు. ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతించడానికి సిద్ధమని చెప్పారు. ఆయనకు ఉండే కొన్ని సమస్యల వల్ల రాలేకపోయి ఉంటారని వ్యాఖ్యానించారు. అందుకు కారణాలు ఏమిటో కేవీపీనే అడగాలన్నారు. తనకు మాత్రం తెలియదన్నారు.

పార్లమెంటులో పోరు, టీడీపీ నోటీసు, ధర్నా: ఎన్నిసార్లు ఇలా.. రాజ్‌నాథ్‌కు బాబు షాక్, ఇదీ లెక్కపార్లమెంటులో పోరు, టీడీపీ నోటీసు, ధర్నా: ఎన్నిసార్లు ఇలా.. రాజ్‌నాథ్‌కు బాబు షాక్, ఇదీ లెక్క

అవసరమైనప్పుడు షర్మిల, విజయమ్మ

అవసరమైనప్పుడు షర్మిల, విజయమ్మ

వైసీపీకి షర్మిల, విజయమ్మ దూరంగా ఉన్నారన్న వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. అవసరం ఎప్పుడు వచ్చినా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షులుగా విజయమ్మ ఇప్పటికీ ఉన్నారని చెప్పారు. జగన్ అరెస్టైన సమయంలో షర్మిల బాధ్యతలు చేపట్టారన్నారు.

20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం20 మంది: వైసీపీ దుష్ప్రచారానికి చెక్ చెప్పేందుకు టీడీపీ 'సైన్యం' సిద్ధం

Recommended Video

TDP-YSRCP MPs Protest In Parliament
షర్మిలకు, జగన్‌కు మధ్య విభేదాలపై

షర్మిలకు, జగన్‌కు మధ్య విభేదాలపై

అవసరమైతే షర్మిల మళ్లీ ప్రచారానికి వస్తారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్‌కు, షర్మిల మధ్య పొరపచ్చాలు ఉన్నాయన్న వార్తలు అంతా వట్టివే అన్నారు. ఇటీవల ప్లీనరీకి కూడా ఆమె వచ్చారని తెలిపారు.

విజయమ్మ ఓటమిపై

విజయమ్మ ఓటమిపై


వచ్చే ఎన్నికల్లో విజయమ్మ, షర్మిల పోటీ చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టం లేదని చెప్పారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం గురించి ఆలోచించిన తర్వాతే విజయమ్మను విశాఖ నుంచి ఎంపీగా బరిలోకి దింపామన్నారు. ఆ పరాజయాన్ని విశ్లేషించుకున్నామని, భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామన్నారు.

English summary
Why Congress MP KVP Ramachandra Rao not joining YSRCP?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X