8 ఏళ్ల బంధానికి బై బై.. ప్రియుడితో ఆ పని కోసం దారుణానికి ఒడిగట్టిన భార్య !
ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ.. మానవ సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యభర్తలు ఒకరిని మరొకరు దారుణంగా హత్య చేస్తున్న ఘటనలు సర్వత్రా కలకలం రేపుతున్నాయి. కొత్తగా పరిచయం అయిన ప్రియుడితో జీవించాలన్న కోరికతో ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్న భర్తను కడతేర్చింది ఓ భార్య ఈ దారుణ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొండిగొల్ల వీధిలో చోటుచేసుకుంది. ఈ క్రూర హత్య స్థానికులను, పోలీసులను సైతం షాక్‌కు గురి చేస్తోంది.
ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం...
నల్లి రాజు, మౌనిక దంపతులు ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంతోషంగా సాగుతున్న ఈ కుటుంబంలో, మౌనికకు పెళ్లైన గుండు ఉదయ్‌కుమార్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజుకు తెలిసి, ఇంట్లో తరచుగా కలహాలు మొదలయ్యాయి. భర్తను అడ్డుగోడగా భావించిన మౌనిక, ప్రియుడు ఉదయ్‌తో కలిసి రాజును హత్య చేసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తొలుత కొత్త నెంబర్‌తో అమ్మాయిగా నటిస్తూ వాట్సాప్ ద్వారా రాజును ఏకాంత ప్రదేశానికి రప్పించి హత్య చేయాలని ప్రయత్నం విఫలమైంది. తర్వాత ఉదయ్ తన బావ మల్లికార్జున సహాయంతో హత్య చేయాలని కొత్త ప్లాన్ వేశారు. పథకం ప్రకారం ఇంట్లోనే రాజుకు నిద్ర మాత్రలు ఇచ్చి బలహీనపరిచారు.
అనంతరం మౌనిక, మల్లికార్జున రాజు చేతులు, కాళ్లు పట్టుకోగా, ఉదయ్ రాజు ఛాతీపై కూర్చొని తలగడతో ఊపిరాడనివ్వకుండా హత్య చేశాడు. చంపిన తర్వాత మృతదేహాన్ని మద్యం తాగి పడిపోయినట్లు నటించేలా దుస్తులు మార్చి.. స్కూటీపై వీధి చివరలో పడవేశారు.
అయితే భర్త కనిపించడం లేదని అత్తమామలకు చెప్పి, ఫోన్ ద్వారా వెతికినట్లు నటించింది మౌనిక. మరుసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కన్నీటి ప్రదర్శన చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో హత్య అని తేలడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆధారాలు బయటపడటంతో మౌనిక, ఉదయ్, మల్లికార్జున ముగ్గురూ రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ కేసు గురించి డీఎస్పీ డి. లక్ష్మణరావు మాట్లాడుతూ.. తాత్కాలిక సుఖాల కోసం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లే పచ్చని కాపురాలు కూలిపోతున్నాయని తీవ్రంగా హెచ్చరించారు. పిల్లల సంరక్షణను కుటుంబ సభ్యులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications