గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: రూ. 5లక్షలు ఇచ్చి కట్టుకున్న భర్తను చంపించింది

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఫిబ్రవరి 17న జిల్లాలోని అచ్చంపేట-వేల్పూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య కేసులో పోలీసులో పురోగతి సాధించారు. హత్య కేసు
నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు సత్తెనపల్లి గ్రామీణ సిఐ బి కోటేశ్వరరావు తెలిపారు.

అమరావతికి చెందిన పల్లపు ఏడుకొండలు, షేక్‌ నాగుల్‌మీరా, ఆకుల నాగబాబు, బత్తుల నారాయణ, కె.స్వామి, మృతుడు కొజ్జా నాగభూషణం భార్య కొజ్జా వాణిలను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు.

నాగభూషణం సత్తెనపల్లి రంగా కాలనీలో నివసిస్తూ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు. నాగభూషణం భార్య వాణిని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇది భరించలేని వాణి పథకం ప్రకారం.. అమరావతికి చెందిన నిందితులతో హత మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

Wife has killers bump off auto driver, arrested

ప్రణాళిక ప్రకారరమే తాను తాళ్ళచెరువులో ఉన్నానంటూ వాణి తన భర్తను రమ్మని కబురు చేసింది. ఈ విషయాన్ని నిందితులకు తెలిపిందని సిఐ వివరించారు. దీంతో నిందితులు వేల్పూరు సమీపంలోకి రాగానే ఆటో నడుపుతున్న నాగభూషణంను దారుణంగా నరికి చంపారు.

కాగా, గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే మృతుడు తన భార్యను తరచూ ప్రశ్నించేవాడని తెలిసింది. ఈ క్రమంలో పలుమార్లు ఆమెను కొట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిందితులకు రూ. 5లక్షల ఇస్తానని చెప్పి వాణి తన భర్తను హత్య చేయించినట్లు తెలిసింది. ముందుగా వారికి రూ. 90వేలు అడ్వాన్సుగా ఇచ్చినట్లు సమాచారం.

English summary
The wife of an Auto driver who hired killers to eliminate him was arrested along with her accomplices here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X