సినిమాకు తీసుకు వెళ్లలేదని కాల్వలోకి దూకిన భార్య, భర్త కూడా దూకాడు..

భర్త సినిమాకు తీసుకు వెళ్లలేదని మనస్తాపానికి గురైన ఓ భార్య కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

విజయవాడ: భర్త సినిమాకు తీసుకు వెళ్లలేదని మనస్తాపానికి గురైన ఓ భార్య కాల్వలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

వాంబే కాలనీకి చెందిన రాజారెడ్డికి నాలుగు నెలల క్రితం తిరుపతమ్మతో వివాహమైంది. ఆదివారం భార్యభర్తల మధ్య సినిమాకు వెళ్లే అంశంలో గొడవ జరిగింది.

Wife tryies to commit suicide

భర్త సినిమాకు రానని చెప్పడంతో మనస్తాపానికి గురైన భార్య తిరుపతమ్మ లెనిన్ సెంటర్ సమీపంలోని ఏలూరు కాల్వలో దూకింది. దీంతో ఏం చేయాలో తెలియని భర్త రాజారెడ్డి ఈత రాకపోయినా ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు.

ఆమెను రక్షించే క్రమంలో ఇరువురు కొట్టుకు పోతుండటాన్ని అక్కడే ఉన్న కానిస్టేబుల్ గుర్తించాడు. వారిని ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+