రిజైన్ చేశాకే పార్టీ మారుతా, కేశవరెడ్డిది పొరపాటే: జగన్‌కు సొంత ఎమ్మెల్యే షాక్
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే షాకివ్వనున్నారనే ఊహాగానాలు ఇటీవల వినిపిస్తున్నాయి. దీనిపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
తాను పార్టీ మారే ముందు కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే తాను పార్టీని మారుతానని చెప్పారు. తన వియ్యంకుడు కేశవ రెడ్డి చేసింది పొరపాటేనని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు.
తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, రాజకీయ భవిష్యత్తును దసరా రోజున వెల్లడిస్తానని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు సీమ ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడుతుందన్నారు. జగన్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుంటే ఆయనకే నష్టమన్నారు.

రైల్వేజోన్ వస్తుందన్న నమ్మకం ఉంది: హరిబాబు
విశాఖ రైల్వేజోన్‌గా ఏర్పాటవుతుందనే ఆశాభావం తమకు ఉందని, త్వరలో అది కార్యరూపం దాల్చవచ్చునని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు గురువారం అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విశాఖను రైల్వేజోన్‌గా తప్పనిసరిగా ప్రకటించాలనే ప్రతిపాదన గట్టిగా వినిపిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications