చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకీ మోదీ గుడ్ న్యూస్..!?

కేంద్రంలో..ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అటు ఢిల్లీలో మోదీ..ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనున్నాయి. కేంద్రంలో మూడో సారి మోదీ అధికారం చేపడుతున్నా.. నెంబర్ గేమ్ ఆసక్తి కరంగా మారుతోంది. చంద్రబాబు, నితీశ్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు. ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ అంగీకరిస్తారా...వరాలు ప్రకటిస్తారా..

ఏపీకి కేంద్ర మద్దతు
కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో ఈ నెల 9న మూడో సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీతో సహ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఆహ్వానించారు. ఇక..కేంద్ర మంత్రివర్గంలో ఈ సారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొనే వారి సంఖ్య..పేర్లు..శాఖల గురించి ఎన్డీఏ ముఖ్యులతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Will Modi govt accepts special status for Andhra Pradesh as Chandra Babu s demand see deets

చంద్రబాబు మంత్రాంగం
ఏపీ నుంచి తెలుగు దేశం నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం దక్కితే టీడీపీకి రెండు బెర్తులకు పరిమితం కానుంది. బీజేపీ నుంచి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉండటంతో కీలక శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఏపీలో పురందేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి హోదా.. మరో ఇద్దరికి సహాయ మంత్రుల హోదా దక్కుతుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీని పైన ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మోదీ ఆలోచన ఏంటి
ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీల అమలు విషయంలోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే..బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ నుంచే అదే రకమైన ప్రతిపాదన వస్తుందనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దీని పైన ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, పోలవం పునరావాసం తో పాటుగా సవరించిన అంచనాల ఆమోదం పైన చర్చ సాగుతోంది. దీని పైన మోదీ ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి కేబినెట్ లో సానుకూల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీని పైన చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+