'కాంగ్రెస్ పార్టీతో వైయస్ జగన్ కలిసిపోతారు, ప్యాకేజీ వద్దనడం ఏమిటి'

విజయవాడ: కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికైనా కలిసిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం నాడు అన్నారు. ఇరు పార్టీలు కలవడం ఖాయమని చెప్పారు.

దిగ్విజయ్‌తో జగన్ రహస్య మంతనాల వెనుక..': కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. దురుద్దేశంతోనే జగన్‌ విశాఖలో సభ పెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వద్దని చెప్పడం సరికాదన్నారు.

Will YS Jagan ally with Congress?

రెండు రోజుల క్రితం కూడా గాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన చరిత్ర దిగ్విజయ్ సింగ్‌ది అని దుయ్యబట్టారు. అలాంటి డిగ్గీతో విమానాశ్రయంలో చాలాసేపు జగన్ రహస్యంగా మంతనాలు జరిపారన్నారు. వారి మంతనాల సారాంశాన్ని వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఉనికి కోసమే ఆరోపణలు

రాజకీయ ఉనికి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+