షర్మిల ఎంట్రీ జగన్ కు లాభమా , నష్టమా - ఇదీ అసలు లెక్క...!!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిల ఎంట్రీతో జగన్ ఓట్ బ్యాంక్ కు నష్టం వాటిల్లుతుందనే మరో వాదన వినిపిస్తోంది. ఇంతకీ..షర్మిల పీసీసీ పగ్గాలు స్వీకరిస్తారా. షర్మిల కాంగ్రెస్ లో క్రియాశీలకంగా మారితే జగన్ పైన ఉండే ప్రభావం ఏంటి. లాభమా- నష్టమా. దీని పైన విశ్లేషకులు అసలు లెక్క తేల్చేసారు.

కొత్త లెక్కలు
ముఖ్యమంత్రి జగన్ సోదరి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ పైన ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి కర చర్చ సాగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరి తన సోదరుడికి వ్యతిరేరకంగా ఏపీలో పని చేస్తారని టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ఖాయమైది. కానీ, పీసీసీ పగ్గాలు ఇవ్వాలనేది పార్టీ ఆలోచన అయినా ఇంకా షర్మిల తన సమ్మతి తెలియచేయలేదని తెలుస్తోంది. అదే విధంగా షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తారంటూ మరో ప్రచారం మొదలైంది. అటు షర్మిల తన కుమారుడు వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే, నిజంగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే జగన్ ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకుంటారనేది ఈ ప్రచార సారాంశం. అసలు ఇది సాధ్యమే కాదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Will YS Sharmila Impacts CM Jagans Success in next Elections, See deets

ఎవరికి నష్టం
కాంగ్రెస్ ను వీడిన సమయం నుంచి జగన్ తన పార్టీని ఒక్కో ఇటుక పేర్చి నిర్మించున్నారు. తాను, తన తల్లితో ప్రారంభమైన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో చేరింది. ఇప్పుడు షర్మిల కొన్ని ప్రత్యేక కారణాలతో కాంగ్రెస్ లో చేరినా.. ఏ మేర తన అన్నకు వ్యతిరేకంగా పని చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని ముందుకు వచ్చినా..కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇక, ఇప్పుడు జగన్ లక్ష్యంగా ఏపీలో షర్మిలను వినియోగించాలని భావిస్తోంది. అందుకు షర్మిల ఇంకా తన నిర్ణయం చెప్పాల్సి ఉంది. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లి కొన్ని ఓట్లు సాధిస్తే అది టీడీపీకి నష్టం తప్ప జగన్ కు ఏ మాత్రం నష్టం ఉండదని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటె ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంత ఎక్కువగా చీలుతుంది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్న చంద్రబాబు, పవన్ కు నష్టం చేసే అంశం.

ఓట్లు చీలిక ఖాయం
నిజంగా షర్మిల యాక్టివ్ గా పని చేసిన జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు మాత్రమే తన వైపు మళ్లించుకొనే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన కు వెళ్లాల్సిన ఓట్లు షర్మిల వైపు వెళ్లటంతో చీలక వస్తుంది. ఇది టీడీపీ కి నష్టం చేస్తుంది. అదే సమయంలో కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. దీని ప్రభావం కూడా టీడీపీకి వెళ్లే ఓటును తమ వైపు తిప్పుకుంటాయనే విశ్లేషణలు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ తో బీజేపీ కలిస్తే అదొక కూటమిగా.. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఒక కూటమిగా జగన్ కు ప్రత్యర్ధులుగా పోటీలో ఉంటాయి. జగన్ పాటిటివ్ ఓటు వైసీపీకీ...వ్యతిరేక ఓటు ఆరు పార్టీలో ఉన్న రెండు కూటములు చీల్చుకోవటం ద్వారా అంతిమంగా జగన్ కే ప్రయోజనం అనేది మెజార్టీ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. దీంతో..షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం అనేది స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+