వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు షాక్: ఎన్నికల్లో వైసిపిదే గెలుపు, పవన్ కళ్యాణ్‌కు అంతే?

ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది. అయినప్పటికి అప్పుడే ఆయా పార్టీల తీరు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వచ్చేట్లుగా కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది. అయినప్పటికి అప్పుడే ఆయా పార్టీల తీరు చూస్తుంటే అప్పుడే ఎన్నికలు వచ్చేట్లుగా కనిపిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడినా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నామని చెప్పినా, జగన్ ముందస్తుకు సిద్ధమవుతున్నా ఎన్నికలు మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

రంగంలోకి రాహుల్ గాంధీ, జగన్‌కు చుక్కలు: చంద్రబాబు జోస్యంరంగంలోకి రాహుల్ గాంధీ, జగన్‌కు చుక్కలు: చంద్రబాబు జోస్యం

అయితే, ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై సర్వేలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో తమకు 111 సీట్లు వస్తాయని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీలోను ఆయా పార్టీలు సర్వేలు చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

సర్వేలో ఆసక్తికరం

సర్వేలో ఆసక్తికరం

కొన్ని ఇతర సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబుపై ఉన్న ఆగ్రహం వైసిపికి లబ్ధి చేకూరుస్తుందని ఓ సర్వేలో వెల్లడయిందని తెలుస్తోంది.

టిడిపిపై వ్యతిరేకత ఉందని..

టిడిపిపై వ్యతిరేకత ఉందని..

రాజధాని నిర్మాణం కదలకపోవడం, ఇచ్చిన హామీలు అనుకున్న స్థాయిలో నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదా అంశం తదితర కారణాలతో టిడిపిపై వ్యతిరేకత ఉందని సదరు సర్వేలో తెలిసిందని అంటున్నారు.

వైసిపి అధికారంలోకి వస్తుందని..

వైసిపి అధికారంలోకి వస్తుందని..

అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా ఈ సర్వేలో తేలిందని అంటున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రభుత్వ ఓటు మాత్రమే చీలుతుందని, అప్పుడు వైసిపికి లబ్ధి చేకూరుతుందని అంటున్నారు.

జనసేన ప్రభావం చూపదా?

జనసేన ప్రభావం చూపదా?

పవన్ కళ్యాణ్‌కు కాస్త ఓటు బ్యాంకు చేరుతుందే కానీ, రాష్ట్రంలో జనసేన ప్రభావం అంతగా లేదని ఈ సర్వేలో తేలింది అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గా మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తుందని ఈ సర్వేలో తేలిందని చెబుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ సహకారం

ప్రశాంత్ కిషోర్ సహకారం


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ కూడా పని చేస్తున్నారు. ఆయన రాజకీయ వ్యూహాలతోను జగన్‌కు లాభిస్తుందనే వాదనలు ఉన్నాయి. అయితే, రాహుల్ గాంధీ బహిరంగ సభ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచితే అది జగన్‌కు నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.

English summary
It is said that YSR Congress Party will win in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X