బియాస్ ట్రాజెడీ: రెప్పపాటులో కొట్టుకుపోయారు

మండి: రెప్పపాటులో బియాస్ నది వరదల్లో విద్యార్థులు కొట్టుకుపోయారు. ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చి విద్యార్థులను కాటేశాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగకూడని ఘోరం జరిగిపోయిందని ప్రాణాల నుంచి బయటపడిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరాు. ఆదివారం జరిగిన పెను విషాదం నుంచి విద్యార్థులు కోలుకున్నట్లు లేరు.

నదిలోని రాళ్లపై కూర్చొని ఫొటోలు తీసుకునేందుకు తాము సిద్ధమవుతున్నామని, మధ్యలో ఉన్న ఓ పెద్ద రాయిపైకి ఎక్కేందుకు అందరూ ప్రయత్నించారని, ఇంతలోనే నీటి ఉధృతి పెరిగిందని అంటున్నారు. ఫొటోలు తీయడం ప్రారంభించే సమయంలో నీరు లేదని, ఒక్కసారిగా నీరు చుట్టుముట్టిందని అంటున్నారు.

Within minutes students washed out by Beas river

విఎన్నార్ విజ్ఞాన్ జ్యోతి విద్యార్థుల్లో 24 మంది గల్లంతయ్యారు. మరో 24 మంది కేవలం పది నిమిషాల తేడాతో తమ ప్రాణాలను దక్కించుకున్నారు. వీరు ఒక్కో బస్సులో 24 మంది చొప్పున ప్రయాణించారు. అయితే, ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగిన ప్రదేశానికి ముందుగా చేరుకున్న బస్సులో విద్యార్థులు నదిలోకి దిగి ఫోటోలు తీసుకుంటున్నారు. వీరి వెనుక మరో బస్సు పది నిమిషాలు ఆలస్యంగా అక్కడకు చేరుకుంది.

జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జనార్దన్ కుమారుడు కొలను రాఘవేంద్ర రెండో బస్సులో ఉన్నాడు. ప్రమాదం జరిగిన చోటికి చేరగానే రాఘవేంద్ర కూడా బస్సు దిగి నదిలోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో ఆ మార్గం గుండా వెళుతున్న ఒక వ్యక్తి విద్యార్థులను వారించి పైన గేట్లు ఎత్తివేశారని తెలిపాడు.

దీంతో వీరు నదిలోకి దిగే ప్రయత్నాన్ని విరమించుకుని, అప్పటికే దిగిన విద్యార్థులకు ప్రమాదం గురించి హెచ్చరించటానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. వీరి అరుపులు నదిలో ఉన్న విద్యార్థులకు వినిపించలేదు. వరద ప్రాణాలు తీసేసింది.

మృత్యుముఖం నుంచి సమయస్ఫూర్తితో తప్పించుకున్న ఓ వ్యక్తి మరో నలుగురు విద్యార్థులను రక్షించాడు. రమణ్ తేజ అనే విద్యార్థి ఆ పనిచేశాడు. కూకట్‌పల్లిలోని మెట్రో వెనుక ఎన్విరాన్ ఎన్‌క్లేవ్‌లో నివసించే బాలాజీ, పద్మ దంపతుల కుమారుడు ఇతను. రెండో బస్సులో ఘటనా స్థలికి చేరుకున్న తేజ మరికొందరు విద్యార్థులతో కలిసి నదిలోకి వెళ్లటానికి ప్రయత్నం చేశాడు.

అయితే నదిలో ఉన్నవారు చెయ్యి ఊపటం గమనించిన తేజ అప్రమత్తమయ్యాడు. ఏదో ప్రమాదం వస్తోందని గ్రహించి.. పరికించి చూడగా వరద నీరు ఉధృతంగా ఉరికి వస్తోంది. దీంతో అతడు నదిలోకి దిగకుండా ఆగిపోయాడు. తనకన్నా ముందుగా నదిలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న మరో నలుగురు విద్యార్థులను వారించి వెనక్కి తెచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+