అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కొడుకును చంపింది
అనంతపురం: తన వైవాహికేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో కన్న కొడుకునే ఓ మహిళ మట్టుబెట్టింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. నంబులపూలకుంట మండలం వడ్డిపల్లెకు చెందిన ప్రభాకర్‌కు అదే గ్రామానికి చెందిన గంగులమ్మతో వివాహమైంది.
వారికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. కుమారుడు వంశీ (14) నల్లచెరువులోని మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే, దంపతులు నాలుగేళ్ల క్రితం విడిపోయారు. ఇద్దరు పిల్లలు కూడా తండ్రి వద్దే వడ్డిపల్లెలో ఉంటున్నారు.
గంగులమ్మ అనంతపురానికి చెందిన రవి నాయక్‌తో సంబంధం కొనసాగిస్తోంది. అయితే, అతనితో పాటు ఆమె మరికొందరితో కూడా తిరుగుతుండడంతో కొడుకు తల్లిని ప్రశ్నించాడు. తండ్రి వద్దే ఉండాలని కోరాడు. దాంతో గంగులమ్మ కుమారుడిని హత్య చేయడానికి పథకం వేసుకుంది.

గత నెల 27వ తేదీన ప్రియుడితో కలిసి నల్లచెరువు స్కూలుకు వెళ్లి మాయమాటలు చెప్పి వంశీని పిలుచుకుని వచ్చింది. కదిరి సమపీంలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుడి పక్కకు తీసుకుని వెళ్లి నాయక్త్ సహాయంతో గొంతు నులిమి చంపేసి పక్కనే ఉన్న కాలువలో పడేసింది.
కుమారుడు కనిపించకపోవడంతో ప్రభాకర్ ఈ నెల 2వ తేదీన నల్లచెరువు పోలీసులకు పిర్యాదు చేశాడు. గంగులమ్మ ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు ఆమె సెల్‌ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. వాటి ఆధారంగా సోమవారం గంగులమ్మను, రవి నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు నిందితులు నేరం అంగీకరించారు. వంశీ మృతదేహం ఎర్రదొడ్డి కాలువలో లభ్యమైంది.












Click it and Unblock the Notifications