అనుమానంతో భార్య హత్య, రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు

అమరావతి: కడప జిల్లా జమ్మలమడుగులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య పైన అనుమానంతం అతను ఆమెను చంపినట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా పాతనందాయిపాలెంలో ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్యాసింజర్‌ రైలుకు తప్పిన ప్రమాదం

తిరుపతి - గంతకల్లు ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. గుంతకల్లు సమీపంలోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద బోగీల నుంచి ఇంజిన్‌ విడిపోయి కిలో మీటరుకు పైగా ముందుకు వెళ్లిపోయింది. డ్రైవర్‌ గమనించి ఇంజిన్‌ను ఆపివేసి అధికారులకు సమాచారమిచ్చాడు. మరో ఇంజిన్‌ సాయంతో బోగీలను రైల్వే స్టేషన్‌కు తరలించారు.

Woman beaten to death by husband

లారీ - బస్సు ఢీ, డ్రైవర్ సజీవ దహనం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని బుట్టాయగూడెం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘనటలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. లారీ కేరళ నుచి వస్తోంది.

విరిగిన రైలు పట్టా

శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం పాలవలస దగ్గర రైలు పట్టా విరిగింది. ట్రాక్‌మన్ గమనించడంతో ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మందన, ఇచ్చాపురం రైల్వేలైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలక్‌నామా, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+