గుంటూరు: పోలీసులమని చెప్పి యువతిపై గ్యాంగ్ రేప్

అమరావతి: గుంటూరు జిల్లాలోని వేమూరులో దారుణం చోటు చేసుకుంది. వేమూరు-కొల్లూరు మధ్య పొలాల్లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులమని చెప్పి ఆ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

Woman Gang Raped in Vemuru, Guntur

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఆర్మీ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది.

చిత్తూరులో ఓ వ్యక్తి దారుణ హత్య

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడు-ఏపీ సరిహద్దులోని ఎగుముదిరి వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు వరదయ్యపాళ్యం మండలం కాంబాకం గ్రామానికి చెందిన నటరాజ్‌గా గుర్తించారు.

కుటుంబ కలహాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎస్సై

ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ నుంచి బోల్తా పడ్డాడు ఓ ఎస్సై. ఈ ఘటనలో ప్రకాళం జిల్లాలోని తాడివారిపల్లె ఎస్ఐ వెంకట రవీంద్రా రెడ్డి(43) కి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఎస్సై వెంకట రవీంద్రా రెడ్డి శనివారం ఉదయం విధుల్లో భాగంగా తాడివారిపల్లి నుంచి తర్లుపాడుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బైక్ గొల్లపల్లి వాటర్‌ ట్యాంక్ సమీపంలోకి చేరుకోగానే అదే సమయంలో ఎదురుగా మరో ద్విచక్రవాహనం రావడంతో, దానిని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి కిందపడ్డాడు.

దీంతో ఎస్సై తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన స్ధానికులు అంబులెన్స్ సాయంతో ఎస్సై వెంకట రవీంద్రారెడ్డిని ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+