తాగేసి వేధింపులు, అనుమానం: భర్తను పంచేసిన భార్య
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తనే సోమవారంనాడు గొడ్డలితో నరికి చంపింది. కుటుంబ కలహాలే దానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త రుద్రప్ప తీవ్రంగా వేధించేవాడని, ఆ వేధింపులను భరించలేకనే ఆమె అతని హత్యకు పూనుకుందని అంటున్నారు.
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బొప్పేపల్లిలో విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మరణించాడు. గ్రామానికి చెందిన రామానాయుడు (55) సోమవారం మధ్యాహ్నం పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.గ్రామానికి చెందిన రుద్రప్ప (35), శకుంతలమ్మ (31)లకు పదేళ్ల కింద వివాహమైంది. అప్పటి నుంచి కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే రుద్రప్ప గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దాంతో పాటు ఆమెను అనుమానిస్తూ వేధించడం ప్రారంభించాడు.
సోమవారంనాడు కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అతను శకుంతలమ్మను కొట్టాడు. ఆ గొడవలో భర్తను నరికి చంపింది. దీంతో రుద్రప్ప మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తెనాలి మూడో పట్టనం పోలీసు స్టేషన్ నుంచి ఆరేపల్లి దుర్గారావు (28) అనే నిందితుడు ఆదివారం రాత్రి పారిపోయాడు. దుర్గారావును పోలీసులు పలు చోరీ కేసుల్లో నిందితుడనే అనుమానంతో నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి పోలీసుల కళ్లు గప్పి అతను పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాతూరు గ్రామంలో మద్యానికి బానిసై ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన నర్సింహారావు (24) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై అతిగా మద్యం సేవించి ఆదివారం రాత్రి మరణించాడు.












Click it and Unblock the Notifications