కూతురుపై రేప్‌యత్నం: చంపి ఇంటిముందు పాతేశారు!

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం నారాయణపురంలో జరిగిన ఈ సంఘటన వివరాలు గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎల్లప్ప, నరసమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఎల్లప్ప నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవపడేవాడు.
గత డిసెంబర్‌లో నెలలో ఓరోజు రాత్రి పీకల దాగా మద్యం తాగి ఎల్లప్ప ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పెద్ద కూతురిపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో భయపడిన ఆమె కేకలు వేసింది. పక్కనే నిద్రిస్తున్న తల్లి లేచి భర్తను అడ్డుకోబోయింది. గట్టిగా తోయడంతో ఎల్లప్ప పక్కనే ఉన్న రాయిపై పడి తల పగిలి ప్రాణాలు విడిచాడు.
అనుకోకుండా ప్రాణాలు విడువడంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. భయంతో దిక్కుతోచని భార్య ఇంటి ముందే గుంత తవ్వి ఎల్లప్ప మృతదేహన్ని అందులో పూడ్చి పెట్టింది. నెల గడిచినా ఎల్లప్ప కానరాకపోవడంతో గ్రామస్థులు వీరిని గట్టిగా నిలదీయడంతో విషయం బయటపడింది.












Click it and Unblock the Notifications