మహిళ మృతి: జగన్ పార్టీ నాయకుడిపై ఆరోపణలు

నాగేశ్వరరావు కుటుంబసభ్యులు తన భార్యపై దుర్మార్గానికి పాల్పడేందుకు ప్రయత్నం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయం బయటకు చెప్తే ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డావని కేసు పెడతానని దుర్గను వారు బెదిరించారని పోలీసులకు నాగరాజు ఫిర్యాదు చేశారు. దీంతో నాగేశ్వరరావుపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదైంది.
ఇదిలావుంటే, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న సుమో ఆగి వున్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది.
మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన రాము, తిప్పేస్వామిగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications