ఆ పార్టీకి మద్దతుగా మహిళా ఓటర్లు..?

ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రం సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతుండగా, జగన్‌ను గద్దె దించడమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం స్పష్టత రావడం లేదు. కొన్ని సర్వేలు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పగా, మరి కొన్ని సర్వేలు కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చాయి.

సర్వేలు సైతం ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా చెప్పకపోవడం విశేషంగా మారింది. అయితే ఏపీలో గెలుపు డిసైడ్ చేసేది మహిళా ఓటర్లే అనేది స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉండటంతో..గెలుపోటములలో వారే ప్రధాన పాత్ర పోషించనున్నారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ కూడా మహిళలకే పెద్దపీట వేస్తూ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మహిళా ఓటు బ్యాంక్ పై చాలా ఆశలు పెట్టుకుంది.కచ్చితంగా మహిళలంతా ఈసారి పూర్తిగా వైసీపీకే అండగా ఉంటారని పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

women voters deciding ap political future cm

అధికారంలోకి వచ్చిన జగన్, మహిళలను ఆకట్టుకునే విధంగానే వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించారు. ప్రతి పథకము తాలూకా సొమ్ములను నేరుగా వారి ఖాతాల్లోనే వేశారు.అమ్మ ఒడి, తల్లి దీవెన, జగనన్న వసతి దీవెన, ఇలా ఏ పథకమైనా, మహిళల ఖాతాలోనే సొమ్ములు జమవుతూ వస్తున్నాయి.అలాగే 36 లక్షల మంది కి ఇళ్ల పట్టాలు ఇవ్వడం వంటివి మహిళలను బాగా ఆకట్టుకున్నాయి.దీంతో మెజార్టీ మహిళలు వైసీపీతోనే ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరి మహిళా ఓటర్లు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+