విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై వెనక్కి తగ్గని చంద్రబాబు: ఇలా సమర్థన

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మన సంస్కృతిని కించపరచబోమంటూనే విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై వెనక్కి తగ్గేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బీచ్ లవ్ ఫెస్టివల్‌ను సమర్థిస్తూ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, పెట్టుబడుల సదస్సు ద్వారా విశాఖపట్నానికి గుర్తింపు వచ్చిందని, వినూత్నమైన ఆలోచలను ప్రోత్సహించి నగరాన్ని ప్రమోట్ చేయదడానికి బీచ్ లవ్ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

విశాఖపట్నం బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలనే ఆలోచనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన తొలిసారి దానిపై ప్రతిస్పందించారు. విశాఖపట్నంలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణ ద్వారా వినూత్న కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని, బీచ్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగానే దాన్ని నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

విజయవాడలోని పిబి సిద్ధార్థ కాలేజీలో 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెసు -2016 సదస్సును సోమవారం ప్రారంభించిన ఆయన బీచ్ లవ్ ఫెస్టివల్‌పై వస్తున్న విమర్శలపై స్పందించారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై కొంత మంది అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాను మొదటి నుంచి కూడా భారతీయ సంస్కృతీసంప్రదాయాలను గౌరవించే వ్యక్తిని అని చంద్రబాబు చెబుకున్నారు. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని చెప్పారు.

Won’t ever defame our culture: Chandrababu

మనది గొప్ప సంస్కృతి అని, ఆ సంస్కృతిని కించపరిచి అవమానించే పనిని తాను చేయబోనని బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఆలోచనపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ అన్నారు వైజాగ్ బీచ్ ఫెస్టివల్‌పై కొంత మంది అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం విచ్ఛిన్న రాజకీయాలు చేస్తోందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.

ఫిబ్రవరి 12వ తేదీ నుంచి వైజాగ్ బీచ్ లవ్ ఫెస్టివల్‌ను మూడు రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 14వ తేదీ వాలంటైన్స్ డే సందర్భంగా ముగింపు ఉత్సవం జరుగుతుంది.

English summary
Chief Minister N. Chandrababu Naidu on Monday said he has the highest regard for Indian culture and traditions.Referring to the controversy over the beach festival in Vizag, Mr Naidu said, “Ours is the greatest of cultures and I will never do anything that may cause damage and defame it.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X