తెలుగు మీడియంలో చదివితే 5 శాతం రిజర్వేషన్ ?

తెలుగు రాష్ట్రాల్లో సైతం తెలుగు భాషపై మమకారం తగ్గిపోతున్న వేళ, ఆంగ్ల మాధ్యమం చదివితే కానీ ఉద్యోగాలు రావని విద్యార్ధులు, వారి తల్లితండ్రులు భావిస్తున్న వేళ విజయవాడలో నిర్వహించిన ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ఓ కీలక తీర్మానం చేసింది. తెలుగు భాషను ప్రోత్సహించేందుకు తెలుగు భాషలో చదివే విద్యార్ధులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.

తెలుగు భాషను ప్రోత్సహించేందుకు వీలుగా విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ 18 కీలక తీర్మానాలను చేసి ఆమోదించింది. ఇందులో ప్రాథమిక విద్య వరకూ తెలుగులోనే బోధన జరగాలని, తెలుగు మీడియం లో చదివే విద్యార్ధులకు ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించింది. కనుమరుగైపోతున్న తెలుగు పదాల్ని వెలికితీసి ప్రాచుర్యం కల్పించాలని, తెలుగు రచనల్ని మరింతగా ప్రోత్సహించాలని మరో రెండు తీర్మానాలు చేసింది.

world telugu conference resolute for 5 percent reservation in jobs to telugu medium learners

ఆంగ్ల పదాలకు సమానమైన తెలుగు పదాల్ని సృష్టించడం, ఇంటా బయటా అన్ని వ్యవహారాల్లోనూ తెలుగును ప్రోత్సహించడం, ఇంజనీరింగ్, మెడిసిన్ నూ తెలుగులోనే బోధించాలన్న కేంద్ర విధానం అమలు చేయడం, డిగ్రీ స్దాయిలో అన్ని సెమిస్టర్లలోనూ తెలుగును ఓ పాఠ్యాంశంగా బోధించడం, గత వైసీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం కోసం తెచ్చిన జీవో 85 అమలు కోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం, హైకోర్టులోనూ తెలుగులో తీర్పులు ఇవ్వడం, చట్టాల్ని తెలుగులోకి అనువదించడం, గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు బాషాభివృద్ధి, ప్రాథికార సంస్థను పటిష్టం చేసి నిధులివ్వడం, తెలుగు అకాడమీ పూర్వ వైభవం కోసం ప్రయత్నించడం ఇలా పలు తీర్మానాలు ఉన్నాయి.

అయితే ఇందులో తెలుగు భాషలో చదివిన వారికి ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాలను కోరుతూ చేసిన తీర్మానం కీలకమైనది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రిజర్వేషన్ ఎక్కడా లేదు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక సైతం తమ మాతృభాషల్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా, ప్రజల్లో భాషాపరమైనా భావోద్వేగాలు చాలానే ఉన్నా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వరకూ మాత్రం వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియంలో చదివిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ డిమాండ్ చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+