వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి విజయసాయిరెడ్డి ఆహ్వానం - మెగాస్టార్ ఎంట్రీ ఎప్పుడు..!?

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీరయ్య విడుదల బిజీలో ఉన్నారు. పూనకాలు లోడింగ్ అంటూ సినిమా పైన భారీ అంచనాలు పెరుగుతున్నాయి. సంక్రాంతి రేసులో ఒకే బ్యానర్ కింద ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. ఈ సమయంలోనే విశాఖలో జరిగిన తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తి కర అంశాలు వెల్లడించారు.

చిరంజీవి రాజకీయాలతో సంబంధాల పైన దర్శకుడు బాబి క్లారిటీ ఇచ్చారు. తాను నటించిన వాల్తేరు వీరయ్యతో పాటుగా బాలయ్య సినిమా వీరసింహారెడ్డి కూడా సక్సెస్ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ సమయంలో వైసీపీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పలికారు.

YCP Leader Vijaya Sai Reddy welcomes the Chiranjeevi decision to settle down Visakhapatnam

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తనకు విశాఖ పైన ఉన్న అభిమానం చాటుకున్నారు. విశాఖలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలోనే భీమిలి రోడ్డులో స్థలం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే అక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పు పైన స్పందించారు. ఆర్కే బీచ్ లో ఈ కార్యక్రమం జరిగి ఉంటే ఇంత మంది రాగలిగేవారు కాదేమోనన్నారు. ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించిన కారణంగానే ఇంత మంది వచ్చారని చిరంజీవి వివరించారు. సీఎంఓ కూడా కొన్ని సూచనలు చేసిందని తెలిసిందని..తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ కు కారణమైన వారికి ధన్యవాదాలు చెప్పారు.

ఇక, చిరంజీవి కామెంట్స్ పైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి స్పందించారు. విశాఖలో స్థిర పడాలే చిరంజీవి కోరికను ఆహ్వానించారు. చిరంజీవిని ఏపీ పరిపాలనా రాజధానిలో స్థిర పడాలని నిర్నయాన్ని స్వాగతిస్తున్నానని సాయిరెడ్డి ట్వీట్ చేసారు. దీంతో, పాటుగా సంక్రాంతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్య సక్సెస్ కావాలని సాయిరెడ్డి ఆకాంక్షించారు.

గతంలోనే ముఖ్యమంత్రి జగన్ తో సమవేశ మైన సమయంలో విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమను విస్తరించేలా చొరవ తీసుకోవాలని చిరంజీవికి సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి ప్రోత్సాహం ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి విశాఖలో స్థిర పడాలనే కోరిక బయటపెట్టటంతో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.

English summary
YSRCP Parliamentary Party leader Vijaya Sai Reddy welcome the Chiranjeevi decision to settle down Visakhapatnam, wihsed Waltair Veeraiah success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X