ఆంధ్రాలో ఎల్లో కలర్ vs బ్లూకలర్, దెబ్బకు దెబ్బ తియ్యాలి
ఆంధ్రప్రదేశ్ లో రంగుల పంచాయతీ మొదలైయ్యింది. గతంలో వైసీపీ నాయకులు బ్లూ కలర్, గ్రీన్ కలర్ రంగులు వేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల ఆరోపణలని తిప్పికొట్టారు. ఇప్పుడు అదే వైసీపీ నాయకులు అన్న క్యాంటీన్ లకు పసుపు రంగులు వేశారని హైకోర్టుకు వెళ్లారు.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ లు వేశారని, ఆ రంగులను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కొందరు వైసీపీ నాయకులు అన్న క్యాంటీన్ లకు వేసిన పసుపు రంగును తొలగించాలని హైకోర్టుకు వెళ్లారు. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా హైకోర్టు ఓ ప్రశ్నవేసింది. పార్టీని బట్టీ రంగులను డిసైడ్ చెయ్యలేమని హైకోర్టు చెప్పింది. అన్న కాంటీన్ లకు గతంలో ఏ రంగులు వేశారు, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వచ్చాయని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. అనంతపురం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆరు వారాలకు పిటీషన్ విచారణ వాయిదా వేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి గ్రామ సచివాలయానికి వైసీపీ నాయకులు బ్లూ కలర్ రంగులు వేశారు.
ఆ సమయంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆ సమయంలో వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని, గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ రంగులు వేయకూడదని, వాటిని వెంటనే తొలగించాలని హైకోర్టు చెప్పింది.,

ఇప్పుడు అన్న కాంటీన్ లకు ఎల్లో కలర్ రంగులు వేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయ దురుద్దేశంతో పని పాట లేని కొందరు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలుమండిపడుతున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రంగుల పంచాచాయితీ మొదలు కావడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య చర్చకు దారి తీసింది.












Click it and Unblock the Notifications