వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు : బాబూరావుకు సొంత పార్టీ నుంచే : నిరసనలు- తోపులాట..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే..సీనియర్ నేత కు సొంత పార్టీ నేతల నుంచే పరాభవం ఎదురైంది. విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ తగిలింది. నియోజకవర్గ పరిధిలో రాజవరం, గజపతినగరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లిన బాబురావును ఆయా గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలోనే ఎమ్మెల్యే కాన్వారుని అడ్డగించి బాబూరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సొంత పార్టీ నేతల నుంచే నిరసన

సొంత పార్టీ నేతల నుంచే నిరసన

సొంత పార్టీ నాయకులు నుంచే వ్యతిరేకత ఎదురవడంతో బాబూరావు ఖంగుతిన్నారు. తనను అడ్డుకున్నవారిని బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు శాంతించలేదు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌, ఎమ్మెల్యే బాబురావు గోబ్యాక్‌, జగన్‌ ముద్దు బాబూరావు వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఒక దశలో ఎమ్మెల్యే మద్దతు దారులు..వ్యతిరేక వర్గాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ నినాదాలు చేసుకున్నారు. దాదాపు గంట సేపు నిరసన చేస్తూ వారంతా ఎమ్మెల్యేను తమ గ్రామంలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

బాబూరావు వైఖరి పై ఆగ్రహంతో

బాబూరావు వైఖరి పై ఆగ్రహంతో

అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని తప్పించారు. పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే గ్రామంలోకి ప్రవేశించారు. అనంతరం అభివద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఆందోళన కార్యక్రమాలకు దిగితే సహించేది లేదంటూ ఎమ్మెల్యే వారిని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులతో పోరాడి బాబూరావును గెలిపించామని, ఇప్పుడు ఎమ్మెల్యే టిడిపి నాయకులతో కలిసి వైసిపి నాయకులను, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని సొంత పార్టీ నుంచే నిరసన వ్యక్తం చేసిన నేతలు ఆవేదన చెందారు.

టీడీపీ కేడర్ తో సన్నిహితంగా ఉన్నారంటూ

టీడీపీ కేడర్ తో సన్నిహితంగా ఉన్నారంటూ


స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అభ్యర్థులను ఓడించి, టిడిపి అభ్యర్థులను గెలిపించేందుకు ఎమ్మెల్యే బాబూరావు తెరవెనక కుయుక్తులు చేసి సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. తమ గ్రామంలో వైసిపి కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టి టిడిపి నాయకులతో సఖ్యతగా ఉంటూ..తమను విస్మరిస్తున్నారంటూ వారంతా ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పరిణామం విశాఖ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. దీని పైన పార్టీ అధినాయకత్వం సైతం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

English summary
Payakarao pet MLA Golla Babu rao faced protests from own party leaders and cadre in his own constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X