సీఎం జగన్ కాన్యాయ్‌లోకి దూసుకొచ్చిన యువకుడు

సీఎం జగన్ పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పటికే సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బస్సుయాత్రలో భాగంగా శనివారం సింగ్‌నగర్‌కు చేరుకున్న సమయంలో సీఎం జగన్‌పై దుండగులు రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది.

రాయి బలంగా తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కనుబొమ్మపై గాయమైంది.సీఎం జగన్‌పై క్యాట్‌ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు వస్తోన్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ ఘటన మరువక ముందే మరో సంఘటన సీఎం జగన్ పర్యటనలో చోటు చేసుకుంది.

young man rammed a police vehicle in the cm jagan convoy

సోమవారం గుడివాడలో మేమంతా సిద్ధం సభ పూర్తి చేసుకున్న సీఎం జగన్ హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు జిల్లాలో ప్రవేశించారు. ఆయన బస్సు ఉంగుటూరు నియోజకవర్గానికి సోమవారం రాత్రి చేరుకుంది. ఉంగుటూరు నియోజకవర్గం పూళ్ళ సమీపంలో బైక్ పై వచ్చిన ఓ యువకుడు ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడిని అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.అయితే ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే చేశారా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+