3 రోజుల్లో పెళ్ళి: వరుడు మృతి, ఏమైందంటే?
హైదరాబాద్: కడప జిల్లా లింగాల మండలంలోని దొండ్లవాగు గ్రామ సమీపంలో ఆదివారం నాడు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో పెళ్ళి కాబోయే యువకుడు మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కడప జిల్లా పులివెందులకు చెందిన జి మరియమ్మ, సంరాజుల కొడుకు శేఖర్‌బాబు కు జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది,.

మే 17వ తేదిన వివాహం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహానికి ఆహ్వనించేందుకుగాను పెళ్ళి పత్రికలను పంచేందుకు మోటార్ సైకిల్‌పై శేఖర్ బాబు వెళ్ళాడు. పులివెందుల నుండి సింహాద్రిపురం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం శేఖర్‌బాబు వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శేఖర్ బాబు మోటార్ బైక్ పై నుండి పడి కిందపడ్డాడు.
రోడ్డుకు బలంగా శేఖర్ బాబు తల తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా శేఖర్ బాబు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో శేఖర్ బాబు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహన్ని పులివెందుల ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications