ఇద్దరు ఖూనీ చేశారు, బాబు ఒప్పుకునేదేంటి: ఎల్లుండి బంద్‌కు జగన్ పిలుపు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిలకు నిరసనగా ఎల్లుండి (శనివారం) ఏపీ వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు.

జైట్లీ ప్రకటన చేస్తే.. చంద్రబాబు ఎవరు ఆహ్వానించేందుకు

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక సాయం పైన ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానిని స్వాగతించారని, ఇది సరికాదని, అసలు స్వాగతించేందుకు ఆయన ఎవరండీ అని జగన్ నిలదీశారు. ఐదు కోట్ల మంది ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేస్తేనే కొంతైనా విశ్వసనీయత ఉంటుందన్నారు.

ఏపీ భగ్గు: 'జైట్లీ గారు, దీనికి ప్రెస్‌మీట్ అవసరమా', జగన్ ఆగ్రహం!

నాడు రాష్ట్రాన్ని విడగొట్టినట్లే

ఈ రాజకీయ నాయకులకు నిజాయితీ లేదని నిన్నటి జైట్లీ ప్రకటనతో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నాడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పార్లమెంటులో కెమెరాలను లైవ్ టెలికాస్ట్ ఆపేసి, ఏపీ ఎంపీలను సస్పెండ్ చేసి ఎలాగైతే అన్యాయం చేశారో.. నిన్న చేసింది (జైట్లీ ప్రకటన) ఇంచుమించు అలాగే ఉందన్నారు.

హోదా మన హక్కు

ప్రత్యేక హోదా మన హక్కు అన్నారు. ఏపీని విడగొట్టినప్పుడు హైదరాబాద్ మనకు ఉండటం లేదు కాబట్టి, వేరవుతున్నందున ఏపీకి నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక హోదా ప్రకటన చేశారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేశారన్నారు.

YS Jagan calls for AP bandh on Sep 10

ప్రత్యేక హోదా ఇవ్వమని ప్రెస్ మీట్ పెట్టి మరోసారి స్పష్టం చేసినట్లుగా నిన్నటి జైట్లీ ప్రకటనతో తేటతెల్లమవుతోందన్నారు. హోదాను మించిన ప్యాకేజీ వస్తుందని అందరూ ఎదురు చూశారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఊదరగొట్టారు

ఏపీకి హోదాను మించిన ప్యాకేజీ వస్తుందని ఉదయం నుంచి ఊదరగొట్టారన్నారు. చంద్రబాబు లీకులు ఇస్తూ ఏదో చేశారని అభిప్రాయపడ్డారు. చివరకు ప్రత్యేక ప్యాకేజీ వస్తుందనుకుంటే చెవిలో క్యాబేజీ పూవులు పెట్టే ప్రకటన చేశారన్నారు. దానిని చంద్రబాబు ఆహ్వానిస్తున్నామని చెప్పడం మరో చెవిలో క్యాబేజీ అన్నారు.

హోదా వస్తే లాభం ఏమంటే..

పారిశ్రామిక రాయితీల పైన బిల్డప్ ఇస్తున్నారని, కానీ అధి డబ్బులు ఇచ్చిపుచ్చుకునేది కాదన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయని చెప్పారు. నిన్న కేంద్రం ప్రకటన, చంద్రబాబు ఆహ్వానించడం చూస్తుంటే ఏపీ ప్రజలను కూనీ చేసినట్లుగా కనిపిస్తోందన్నారు.

విభజన సమయంలో ఇలాగే చేశారన్నారు. హోదా మన హక్కు అన్నారు. అర్ధరాత్రి ప్రకటనతో దగా చేశారన్నారు. ఇద్దరు (జైట్లీ, చంద్రబాబు) కలిసి కూనీ చేశారన్నారు. వీరి వైఖరికి నిరసనగా.. ఎల్లుండి బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టులతో మాట్లాడామన్నారు. అసలు జైట్లీ ప్రకటనను ఆహ్వానించేందుకు చంద్రబాబు ఎవరని నిలదీశారు.

చంద్రబాబుపై అప్పుడే ఒత్తిడి

చంద్రబాబు పైన ఒత్తిడి తెస్తేనే కేంద్రం నుంచి ఆయన బయటకు వస్తారని, అప్పుడే ప్రత్యేక హోదా వస్తుందని జగన్ అన్నారు. చంద్రబాబు మనసు మారాలంటే, ఆయన బుద్ధి మారాలంటే రాష్ట్రవ్యాప్తంగా అందరూ బందులో పాల్గొనాలన్నారు. చంద్రబాబు ఆహ్వానించడాన్ని మేం ఒప్పుకోవడం లేదన్నారు. హోదాకు బదులు ప్యాకేజీ ఎంత ఇచ్చినా సరిపోదాన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+