జగన్ రోడ్‌షో: చిరునవ్వే ముఖ్యమన్న షర్మిల(పిక్చర్స్)

గుంటూరు/కర్నూలు/తూర్పుగోదావరి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలా తాను అబద్ధాలు చెప్పలేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ వ్యక్తి అయితే పేదవాడి మనసు ఎరుగుతాడో అలాంటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట, వినుకొండలలో బుధవారం జరిగిన వైయస్సార్ జనభేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క రోజూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లలేదని, వారి కష్టాలు పట్టించుకోలేదని విమర్శించారు. అదే విషయాన్ని చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పుడు ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.

రైతులను మోసం చేశారు: బాబుపై విజయమ్మ

దొంగ హామీలతో రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పుకోగలరా అని విజయమ్మ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో నిర్వహించిన వైయస్ జనభేరిలో ప్రసంగించారు. రాష్ట్రంలో స్కాములన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని ఆరోపించారు.

మరోవైపు జగన్మోహన్ రెడ్డి సోదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోరాడింది ఒక్క జగన్మోహన్ రెడ్డినేనని అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వును చూడటమే జగనన్నకు ముఖ్యమని షర్మిల చెప్పారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు రైతుల గురించి గానీ, ప్రజల గురించీ గానీ పట్టించుకోలేదని ఆరోపించారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట, వినుకొండలలో బుధవారం జరిగిన వైయస్సార్ జనభేరిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలా తాను అబద్ధాలు చెప్పలేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

ఏ వ్యక్తి అయితే పేదవాడి మనసు ఎరుగుతాడో అలాంటి వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు.

విజయమ్మ ప్రసంగం

విజయమ్మ ప్రసంగం

దొంగ హామీలతో రైతులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు.

ముస్లిం సోదరులతో..

ముస్లిం సోదరులతో..

అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. ఏ ఒక్క రోజూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లలేదని, వారి కష్టాలు పట్టించుకోలేదని విమర్శించారు.

వైయస్ విగ్రహంతో పార్టీ నేతలు

వైయస్ విగ్రహంతో పార్టీ నేతలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో నిర్వహించిన వైయస్ జనభేరిలో ప్రసంగించారు.

ఫ్యాన్ తిప్పిన షర్మిల

ఫ్యాన్ తిప్పిన షర్మిల

వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల కర్నూలులో పర్యటించారు.

షర్మిల ప్రసంగం

షర్మిల ప్రసంగం

ప్రజల సమస్యలపై పోరాడింది ఒక్క జగన్మోహన్ రెడ్డినేనని షర్మిల అన్నారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వును చూడటమే జగనన్నకు ముఖ్యమని షర్మిల చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+