వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాకతిప్ప బాధితులను ఓదార్చిన జగన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: జిల్లాలోని వాకాతిప్పలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన బాధితులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారికి అందాల్సిన సాయంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. వాకాతిప్ప ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రచారం ఆధారంగానే ఏపి సిఎం చంద్రబాబు పరిహారం ప్రకటిస్తున్నారని విమర్శించారు. బాధితులకు పరిహారం సరైన రీతిలో ప్రకటించడం లేదని అన్నారు. ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు.

ప్రచారం తక్కువ అవుతుందనుకుంటే అక్కడ లక్ష లేక 2 లక్షల రూపాయలే ప్రకటిస్తారని అన్నారు. ఈ గ్రామంలో పేలుడు ఘటనలో చనిపోయిన వారందరూ కూలీలేనని చెప్పారు. పరిహారం అందరికీ సమానం ఉండాలని జగన్ డిమాండ్ చేశారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

తూర్పుగోదావరి జిల్లాలోని వాకాతిప్పలో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన బాధితులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు పరామర్శించారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వైయస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

వాకాతిప్ప ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రచారం ఆధారంగానే ఏపి సిఎం చంద్రబాబు పరిహారం ప్రకటిస్తున్నారని విమర్శించారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

బాధితులకు పరిహారం సరైన రీతిలో ప్రకటించడం లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

జగన్ పరామర్శ

జగన్ పరామర్శ

ప్రచారం ఎక్కువగా జరుగుతుందని అనుకుంటే అక్కడ 5 లక్షల రూపాయలు ప్రకటిస్తారని చెప్పారు. ప్రచారం తక్కువ జరుగుతుందనుకుంటే అక్కడ లక్ష లేక 2 లక్షల రూపాయలే ప్రకటిస్తారని అన్నారు.

English summary
YSR Congress Party chief YS Jagan Mohan Reddy on Wednesday consoled the grief-stricken family members of the firecrackers blast at Vakatippa in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X