జగన్ నేరుగా తొలి ధర్నా - ఇక జనంలోకి, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సస్ వైసీపీ అన్నట్లు గా రాజకీయం మారింది. ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు. ఇక.. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అదే విధంగా 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో తొలి సారి జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవ్వటంతో ఇక ప్రజా సమస్యల పైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్దమవుతున్నారు. వైసీపీ ఫీజులు, వ్యవసాయం, కరెంట్ బిల్లలు పైన నిరసనలు చేసింది. అయితే.. వీటిల్లో జగన్ పాల్గొన లేదు. ఇప్పుడు పెన్షన్ల కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే, పెన్షన్ల అంశం పైన వైసీపీ పోరుబాట చేపట్టాలని డిసైడ్ అయింది.

అందులో భాగంగా పెన్షన్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం. ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ జిల్లాలో రెండు రోజులు జగన్ పర్యటన కొనసాగేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో నియోజవకర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.
పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు.. పార్టీ బాధ్యతల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 2029 ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టం చేసారు. ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు - కేడర్ తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి జోష్ తేవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లేదా రేపు అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications