వైసీపీ అభ్యర్దిగా బొత్సా, విజయం దక్కేనా- ఎవరి బలం ఎంత..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో కూటమితో వైసీపీ మరోసారి తల పడనుంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ అభ్యర్దిని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. వైసీపీకి సంఖ్యా పరంగా బలం ఉంది. ఈ క్రమంలో మాజీ మంత్రి బొత్సాను తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా జగన్ పార్టీ నేతల భేటీలో ఖరారు చేసారు.
వైసీపీ అభ్యర్దిగా బొత్సా
వైసీపీ ఎమ్మెల్సీగా పని చేసిన వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. దీంతో, ఆయన పైన వేటు వేయటంతో ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికలో ఓట్ల పరంగా వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 ఉంది.. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 11 స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఎవరి బలం ఎంత
ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో వలసలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. విశాఖకు చెందిన కార్పోరేటర్లతో పాటుగా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీకి పూర్తి బలం ఉండటంతో అందరూ సమన్వయంతో పని చేసి విజయం సాధించాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతోనూ భేటీ అయ్యారు. అభ్యర్ది ఎంపిక పైన వారి అభిప్రాయాలు సేకరించారు. బొత్సా పేరును అధికారికంగా ఖరారు చేసారు. వెంటనే ఎన్నికలో గెలుపుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.
గెలుపు దక్కేదెవరికి
తాజా ఎన్నికల్లో బొత్సా సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఇప్పుడు సంఖ్య పరంగా గెలిచే అవకాశాలు ఉండటంతో..కూటమి ఎత్తులను ధీటుగా ఢీకొట్టేందుకు బొత్సాను జగన్ రంగంలోకి దించారు. ఈ ఎన్నికకు ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 16 వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు. దీంతో, ఈ ఎన్నికల్లో గెలుపును కూటమి..వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా దక్కాయి.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications