‘జగన్ వస్తున్నారంటే బాబుకు భయం’(ఫొటోలు)
అనంతపురం: ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా మూడో రోజు మంగళవారం కూడేరు, మర్తాడుల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నో అబద్ధాలాడి సిఎం అయిన ముఖ్యమంత్రి దేశచరిత్రలో లేరని ఎద్దేవా చేశారు.
పిక్‌పాకెట్‌కు 420 కేసు పెడతారు.. తప్పుడు హామీలతో మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలి? అని ప్రశ్నించారు. ‘మొదట రైతు ఆత్మహత్యలే లేవన్న చంద్రబాబు.. మా ఒత్తిడితో ఒప్పుకున్నారు. జగన్ వస్తున్నారని భయం తప్ప.. రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు' అని జగన్ అన్నారు.

‘అతి త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది.. మన ప్రభుత్వం వస్తుంది రైతులు, డ్వాక్రా మహిళలు ఏ ఒక్కరూ అధైర్యపడొద్దు' అని వైఎస్ జగన్ చెప్పారు. 'ఎన్నికలకు ముందు ఒక మాట.. ఆ తర్వాత మరోమాట చెప్పి రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారు' అని ఆరోపించారు.

చంద్రబాబులా పచ్చి అబద్ధాలు ఆడే సీఎం.. దేశ చరిత్రలో ఎవ్వరూ లేరని అన్నారు. బాబు చేసిన మోసాలతో కష్టాలు వచ్చిన మాట నిజమే. అయితే నాదో విన్నపం. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు నేనున్నా.. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి తెస్తాం. ధైర్యంగా ఉండండి' అని వైయస్ జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications