హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం రాం: మీరే తీర్పులిచ్చుకోండి, చంద్రబాబు క్యారెక్టర్, క్రెడిబులిటీపై జగన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోజా వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని సభలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మండిపడ్డారు. వైసీపీకి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, కోర్టు ఉత్తర్వులు, ఆమెను సభలోకి రాకుండా అడ్డుకున్న వైనం... తదితర పరిణామాలపై శనివారం ఆయన మాట్లాడారు.

రోజా వ్యవహారంలో ప్రభుత్వం తీరుని ఖండిస్తూ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తన ఎమ్మెల్యేతో కలిసి టాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన జగన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడాతూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Ys jagan fires on speaker and chandrababu naidu over roja issue

హైకోర్టు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన నేపథ్యంలో, ఆమెను సభలోకి అనుమతించేందుకు నిరసన తెలుపే అవకాశం ఇవ్వలేదని, తమకు స్పీకర్ మైక్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రోజా సస్పెన్షన్ విషయంలో స్పీకర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

సభలో ఏకగ్రీవంగానే రోజమ్మను సస్పెండ్ చేశామని స్పీకర్ చెబుతున్నారని, 67 మంది సభ్యులున్న తమ పార్టీ స్పీకర్‌ ఆ విషయంపై ప్రశ్నించగా సమాధానం చెప్పడం లేదంటూ మండిపడ్డారు. న్యాయస్థానాలను గౌరవించలేని అధ్వాన్న పరిస్థితుల్లో మన చట్టసభలు ఉన్నాయని అన్నారు.

స్పీకర్ నిర్ణయానికి నిరసనగా సోమవారం దాకా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. న్యాయవ్వవస్థ ఇచ్చిన తీరుపై చట్ట సభల్లో తిరిగి చర్చించడం దుర్మార్గమని చెప్పారు. న్యాయవ్వవస్థను సైతం చంద్రబాబు ప్రభుత్వం దిగజారుస్తుందన్నారు.

కంటెప్ట్ ఆప్ కోర్ట్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరుగుతుందని, కోర్టు విచారణకు మద్దతుగా మేం సోమవారం శాసనసభకు వెళ్లడం లేదని అన్నారు. నిజానికి రాజకీయాల్లో ఉండేవారికి క్యారెక్టర్, క్రెడిబులిటీ ఉండాలని అన్నారు. కానీ చంద్రబాబు వ్యక్తిత్వం ఏంటంటే పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోడిచారని అది ఆయన క్యారెక్టర్ అని అన్నారు.

ఇక విశ్వసనీయత విషయానికి వస్తే ఎన్నికలకు ముందు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని అన్నారు. మధ్యాహ్నం ప్రివిలైజ్ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో దానిపై కూడా జగన్ మండిపడ్డారు. ప్రివిలైజ్ కమిటీ అంటే చంద్రబాబుకు సంబంధించిన సభ్యులే అత్యధికంగా ఉంటారని, అక్కడ మాకు ఏం న్యాయం జరుగుతుందని అన్నారు.

నిండు సభలో చంద్రబాబు తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించారని జగన్ అన్నారు. ఏయ్, చంపి పాతరేస్తా, వేలు చూపిస్తూ నీ అంతు చూస్తా లాంటి వ్యాఖ్యలతో మమ్మల్ని బెదిరిస్తే వాటిపై ప్రివిలైజ్ కమిటీలో ఫిర్యాదు చేస్తే వాటిపై కనీసం విచారణ కూడా చేపట్టలేదని అన్నారు. అసభ్య పదజాలాన్ని చంద్రబాబుతో పాటు కేబినెట్ మంత్రులు వాడుతున్నారని ధ్వజమెత్తారు.

స్పీకర్ కుర్చీని వాడుకుని తన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. ఒక అబలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు

English summary
Ys jagan fires on speaker and chandrababu naidu over roja issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X