ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలుపుకు జగన్ తాజా వ్యూహం-టీడీపీ అభ్యర్ధి పోటీ-రెబెల్స్ క్రాస్ ఓటింగ్ ?

ఏపీలో పట్టభద్రుల, టీచర్ల, స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ పోరు ముగియడంతో ఇప్పుడు వైఎస్ జగన్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టారు.

అమరావతి : ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఊహించినట్లుగానే సెమీ ఫైనల్స్ గా మారిపోయాయి. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్లు, స్ధానిక సంస్ధల కోటాలో 9 ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా శ్రమించింది. ఇప్పుడు పూర్తి బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక్లలోనూ వైసీపీ శ్రమించాల్సి వస్తోంది.

ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే కోటా ఎన్నికల్ని గెలిచేస్తారని అంతా భావించారు. కానీ విపక్ష టీడీపీ చివరి నిమిషంలో పంచుమర్తి అనురాధతో నామినేషన్ వేయించింది.దీంతో వైసీపీ అప్రత్తమైంది. టీడీపీ గెలిచే అవకాశం లేకపోయినా అనురాధతో నామినేషన్ వేయించడం వెనుక ఇద్దరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి మద్దతుతో పాటు వైసీపీలో మరికొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకునేందుకు జగన్ సిద్ధపడటం లేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోరు గెలిచేందుకు వ్యూహం సిద్ధం చేశారు.

ys jagan focus on sweaping mla quota mlc elections amid tdp candidate nomination

ఇవాళ అసెంబ్లీ వాయిదా తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం సమీక్ష చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రులకు బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మంత్రికి కొంతమంది ఎమ్మెల్యే లను జగన్ అటాచ్ చేయనున్నారు. ఓటు వేసేవరకూ ఆయా ఎమ్మెల్యేలను మంత్రులు సమన్వయం చేయాల్సి ఉంటుంది.
ఈ మేరకు జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి బరిలో ఉంటడం, ఆ పార్టీ నేతలు చేస్తున్న సవాళ్లు, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వంటి అంశాలు జగన్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+