విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో దీపావళి వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సమయంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి పాలనా పరమైన అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 6511 పోలీస్ నియామకాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ 6511 పోలీస్ పోస్టుల్లో 2520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు, 3580 సివిల్ కానిస్టేబుళ్లు, 315 సివిల్ ఎస్పై, 96 రిజ‌ర్వ్ ఎస్సైల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్లడించింది.

పోలీస్ ఉద్యోగాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ వెలువ‌డ‌టంతో నిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. చాలా కాలం త‌రువాత పోలీసు ఉద్యోగాల నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో నిరుద్యోగులు ఈ ఉద్యోగాల‌పై దృష్టిసారించే అవ‌కాశం ఉన్న‌ది.

YS Jagan Government Nod to Fill Over 6000 New Police Posts, Notification Soon

ఇటీవ‌లే గ్రూప్ ఉద్యోగాల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. గతంలోనే జాబ్ కాలెండర్ ప్రకటించి...ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు అందులో భాగంగా ముందుగా పోలీసు ఉద్యోగాల భర్తీ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ రోజు పోలీసు అమర వీరుల దినోత్సవ కార్యక్రమం విజయవాడలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పోలీసు శాఖ పైన కొద్ది రోజులుగా వస్తున్న రాజకీయ విమర్శలు.. పోలిసింగ్ కు సంబంధించిన అంశాలతో పాటుగా ఖాళీల భర్తీకి సంబంధించి కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది.

English summary
CM Jagan gave a nod for filling up a large number of police personnel in the State police department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X