పిఠాపురంలో మారుతున్న జగన్ రాజకీయం, కీలక మార్పులు..!!

ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడే ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రధాన నియోజకవర్గాల పైన గురి పెట్టాయి. 2024 ఎన్నికల్లో 11సీట్లకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు కూటమికి బలం ఉన్న నియోజక వర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గెలిచిన పిఠాపురం లో కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. కీలక మార్పులకు సిద్దం అవుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ లెక్కలు మారుతున్నాయి. 2019 లో వైసీపీ గెలిచిన ఈ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. ఈ నియోజక వర్గం నుంచి మాజీ ఎంపీ వంగా గీతను జగన్ బరిలోకి దింపారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున అక్కడే సభ ఏర్పాటు చేసి.. గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా.. ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు. టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్న వర్మ సైతం పవన్ కు మద్దతుగా నిలిచారు. అయితే, ఇప్పుడు అక్కడ లెక్కలు మారుతున్నాయి. పవన్ తో సఖ్యతగా ఉంటున్న వర్మకు జనసేన నియోజకవర్గ నేతలతో గ్యాప్ వచ్చింది. వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ ఇప్పటి వరకు దక్క లేదు. వర్మ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ys-jagan-implementing-new-plans-for-pithapuram-against-pawan-details-here

కాగా, తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు జగన్ తో భేటీ అయ్యారు. ప్రత్యేకం గా పిఠాపురం లో పరిస్థితుల పైన జగన్ ఆరా తీసారు. వంగా గీత కు అక్కడ అంశం పైన చర్చ జరిగింది. గీత ప్రస్తుతం ఇంఛార్జ్ గా కొనసాగుతున్నా... పూర్తి స్థాయిలో ఫోకస్ చేయటం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అయింది. అయితే, గీత కంటే బలమైన నేత వైసీపీకి నియోజక వర్గంలో లేరని జిల్లా నేతలు స్పష్టం చేసారు. కాగా.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సహా జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులను పిఠాపురం లో గీతకు మద్దతు గా నిలవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. అక్కడ నుంచే 2029ఎన్నికలకు సమాయత్తంగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేయాలి అని నిర్దేశించారు.

ఇక, నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల పైన తెప్పించుకున్న సర్వే నివేదికల ఆధారంగా జగన్.. కీలక దిశా నిర్దేశం చేసారు. త్వరలోనే తూర్పు గోదావరి కేంద్రంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన కు జగన్ సిద్దం అవుతున్నారు. దీంతో..అటు పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న వారిలోనూ పవన్ మార్పులు చేసారు. వర్మ పాత్ర కీలకంగా మారుతోంది. తాజా పరిణామాలతో పిఠాపురం కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+