వైసీపీ ఓటమికి జగన్ కారణం; తెలంగాణాలో బీజేపీ సీట్లకు కాంగ్రెస్ వైఫల్యాలు కారణమట!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి విజయం సాధించిందని జగన్ పాలనను తుంగలో తొక్కి కేవలం సంక్షేమ పథకాలు ద్వారానే విజయం సాధించిన ఊహలో ఉండటంతో నేడు ఓటమి పాలయ్యారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆమెని కేంద్రం తుంగలో తొక్కిందని, ప్రస్తుతం టిడిపి కూటమికి ప్రజలు పట్టం కట్టడంతో చంద్రబాబు రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంలో కొట్లాడాలన్నారు సిపిఐ నారాయణ.
ఏపీలో బిజెపి ప్రభావం కూటమి విజయంపై లేదు
కూటమి వల్లే ఏపీలో బీజేపీకి సీట్లు వచ్చాయని, ఏపీలో బిజెపి ప్రభావం కూటమి విజయంపై లేదన్నారు. హైద్రాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్దూమ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ఏపీ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అంటూ రాష్ట్ర అభివృద్ధిని జగన్ పక్కన పెట్టారన్నారు.

జగన్ ఓటమికి కారణం ఇదే
రాష్ట్రాభివృద్ధి తుంగలో తొక్కిన ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారు అన్నారు. జగన్ భూరక్ష పేరుతో తెచ్చిన పథకం బోగస్ అని విమర్శించారు. కేవల జగన్ యొక్క నియంతృత్వ పోకడలతోనే వైసిపి పరాజయం పాలైంది అన్నారు. అటు కేంద్రంలో బీజేపీ ఆశలు పెట్టుకున్న 400 సీట్లు సాధించలేక పోయింది అన్నారు. అయోధ్య రామ మందిరం సెంటిమెంట్ ఫలించలేదు అన్నారు.
చంద్రబాబుకు సీపీఐ నారాయణ సలహా
విభజన హామీలు బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు అని, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ విషయం లో పట్టించుకోలేదు అని తెలిపారు. ఇండియా కూటమి గెలిస్తే ప్రత్యేక హోదా ఇస్తాం అన్నారు అని గుర్తు చేశారు. వీటన్నిటి నుండి ప్రజలకు కావాల్సింది తెలుసుకుని చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించాలని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు అని కోరారు.

తెలంగాణాలో బీజేపీ సీట్లు కాంగ్రెస్ వైఫల్యాల వల్లే
పవన్ కళ్యాణ్ విజయానికి శుభాకాంక్షలు తెలుపుతూ... పవన్ కళ్యాణ్ ఏమి లేనప్పుడే ఆయన ప్రజలు కోసం నిలబడ్డారని తెలిపారు.కాగా తెలంగాణలో ఎందుకు బీజేపీకి సమానమైన సీట్లు వచ్చాయో అర్థం చేసుకోవాలి అన్నారు. దీనికి కారణం కేవలం కాంగ్రెస్ వైఫల్యాలే అని తెలిపారు. తమిళనాడు డీఎంకే తెచ్చిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకి కారణం కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు కారణమన్నారు.
వాస్తు మార్చి మార్చి కేసీఆర్ ఫాం హౌస్ కు పరిమితం అయ్యారు
మరోవైపు సచివాలయం వస్తూ మార్పు విషయంలో మాట్లాడుతూ....కేసీఆర్ అనేక వాస్తు మార్పులు చేసి ఇవాళ ఫాం హౌస్ లో ఉన్నాడు. వాస్తు అనేది సొంత ఇంటికి సంబంధించి చేసుకోవాలని సూచించారు. అనంతరం కెసిఆర్ పాలన పై విమర్శలు చేశారు నారాయణ. కేసీఆర్ రాజకీయ పాలన చేస్తే ఫాం హౌస్ లో ఉండేవాడు కాదని... సచివాలయం లో ఉండేవారని అన్నారు. .












Click it and Unblock the Notifications